Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Ayurvedic Tips: మృతకణాలు తొలగి చర్మం లోపలి నుంచి శుభ్రపడాలంటే.. ఈ ఐదు పదార్ధాలను తీసుకోండి..

సూర్యరశ్మి, వేడి , ధూళి కారణంగా చర్మంలో మృతకణాలు పేరుకుపోయి నిర్జీవంగా మారుతుంది. చర్మంలోని మురికిని శుభ్రం చేయడానికి ఒక మార్గాన్ని డిటాక్సిఫైయింగ్ అంటారు. ఆయుర్వేదంలో కూడా, శరీరం, చర్మాన్ని నిర్విషీకరణ చేయడానికి అనేక మార్గాలున్నాయి. లోపలి నుండి చర్మాన్ని శుభ్రం చేయడానికి మీరు కొన్ని ఆయుర్వేద ఆహారం ,

Summer Ayurvedic Tips: మృతకణాలు తొలగి చర్మం లోపలి నుంచి శుభ్రపడాలంటే.. ఈ ఐదు పదార్ధాలను తీసుకోండి..
Summer Tips
Follow us
Surya Kala

|

Updated on: Apr 21, 2023 | 1:19 PM

వేసవి కాలంలో ఎవరైనా బయటకు వెళ్లాలంటే కొంచెం భయపడతారు. పని లేదా ఇతర కారణాల వల్ల మండే ఎండలో వెళ్లాలంటే ఇబ్బంది పడతారు. అయినప్పటికీ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు . సూర్యరశ్మి, వేడి , ధూళి కారణంగా చర్మంలో మృతకణాలు పేరుకుపోయి నిర్జీవంగా మారుతుంది. చర్మంలోని మురికిని శుభ్రం చేయడానికి ఒక మార్గాన్ని డిటాక్సిఫైయింగ్ అంటారు. ఆయుర్వేదంలో కూడా, శరీరం, చర్మాన్ని నిర్విషీకరణ చేయడానికి అనేక మార్గాలున్నాయి. లోపలి నుండి చర్మాన్ని శుభ్రం చేయడానికి మీరు కొన్ని ఆయుర్వేద ఆహారం , మూలికల సహాయం తీసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం..

ఢిల్లీకి చెందిన ఆయుర్వేద నిపుణుడు ఆర్‌వి పరాశర్ ఇదే విషయంపై మాట్లాడుతూ.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలని.. అంతేకాదు త్రిఫల లేదా పసుపు వంటి అనేక పదార్థాలు చర్మాన్ని నిర్విషీకరణ చేయగలవని పేర్కొన్నారు.

ఎక్కువగా నీరు తాగడం  వేసవిలో చర్మాన్ని డిటాక్స్ చేసేందుకు నీళ్లే ఉత్తమ మార్గమని డాక్టర్ ఆర్.వి. చెప్పారు. ఇలా చేయడం వలనా చర్మంలో తేమతో పాటు మంచి నిగారింపు ఉంటుందని.. చర్మం మెరుస్తుంది,  టానింగ్ ఏర్పడదు అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

పసుపు ఉత్తమం పసుపు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇవి ఆరోగ్యానికి, చర్మానికి రెండింటికీ మేలు చేస్తాయి. శరీరం, చర్మాన్ని నిర్విషీకరణ చేయడానికి మీరు ప్రతిరోజూ ఒక చిటికెడు పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. కావాలంటే పసుపు మాస్క్ కూడా వేసుకోవచ్చు.

వేపతో చేసే వంటకం ఆయుర్వేదంలో మాత్రమే కాదు.. చర్మ నిర్విషీకరణలో కూడా వేప మంచిదని విదేశీ నిపుణులు సైతం  భావిస్తున్నారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక వేప తో చేసే వంటకం చర్మం నుండి విషాన్ని సులభంగా తొలగిస్తుంది. వీలైనప్పుడు వేప నీటిని తాగవచ్చు. అంతేకాదు వేప ఆకుల పేస్ట్‌ను కూడా చర్మానికి అప్లై చేయవచ్చు.

త్రిఫల ప్రయోజనాలు ఆయుర్వేద మూలికల కలయిక త్రిఫల చూర్ణం. ఇది శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. రోజూ ఒక చెంచా త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే 15 రోజుల్లో ఆరోగ్యంతో పాటు చర్మంలో కూడా తేడాను గమనించవచ్చు.

ప్రభావంతంగా పనిచేసే ఉసిరి  ఉసిరి ఏ సీజన్ లో నైనా ఉత్తమ ఆహారం. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ప్రతి సీజన్‌లో వినియోగించవచ్చు. ఉసిరిని తీసుకోవడం వలన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచవచ్చు. చర్మాన్ని మెరుగుపరచడానికి, ఆరోగ్యంగా ఉండటానికి కొల్లాజెన్ చాలా ముఖ్యం.. కనుక రోజూ పరిమిత పరిమాణంలో ఉసిరిని తినండి. ఇది కాకుండా.. ఉసిరి మాస్క్ లేదా ఫేస్ ప్యాక్ కూడా అప్లై చేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తిని అనురించి ఇచ్చింది. దీనికి ఎటువంటి శాస్త్రీయ అధరాలు లేవు. కనుక వీటిని పాటించే ముందు నిపుణుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.