Summer Health Care Tips: వేసవి నుంచి ఉపశమనం కోసం ఈ చౌకైన ఫుడ్‌ను రోజు మీరు తినే ఆహారంలో చేర్చుకోండి..

వేసవిలో డీహైడ్రేషన్ లేదా వడదెబ్బ కారణంగా చాలా సమస్యలు వస్తాయి. వీలైనంత వరకు ఇంటి లోపల ఉండటం ద్వారా వేసవి తాపం నుంచి ఉపశమనం నుంచి లభిస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా  శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. కొన్ని రకాల సింపుల్ ఫుడ్స్ తో వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు ఆ ఫుడ్ ఏమిటో తెలుసుకుందాం.. 

Summer Health Care Tips: వేసవి నుంచి ఉపశమనం కోసం ఈ చౌకైన ఫుడ్‌ను రోజు మీరు తినే ఆహారంలో చేర్చుకోండి..
Summer Health Care Tips
Follow us

|

Updated on: Apr 18, 2023 | 3:18 PM

ఏప్రిల్ నెల నుంచి వేసవి కాలం మొదలవుతుంది. అయితే జూన్ నెలలో కనిపించే వేసవి తాపం ఏప్రిల్ నెలలోనే మొదలవుతుంది.    మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడం లేదా మండే వేడి నుంచి ఉపశమనం పొందడం కష్టం. ఈ కారణంగా  చాలా మంది ప్రజలు వేసవి కంటే శీతాకాలాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. వేసవిలో డీహైడ్రేషన్ లేదా వడదెబ్బ కారణంగా చాలా సమస్యలు వస్తాయి. వీలైనంత వరకు ఇంటి లోపల ఉండటం ద్వారా వేసవి తాపం నుంచి ఉపశమనం నుంచి లభిస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా  శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. కొన్ని రకాల సింపుల్ ఫుడ్స్ తో వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు ఆ ఫుడ్ ఏమిటో తెలుసుకుందాం..

పెరుగు లేదా మజ్జిగ

పెరుగుతో చేసిన ఏ ఆహారపదార్ధాలను అయినా వేసవి నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. మధ్యాహ్న భోజనంలో ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఉపశమనం కలుగుతుంది. ఇది కడుపులో ఉత్పత్తి అయ్యే వేడి, అసిడిటీని మీ నుంచి దూరంగా ఉంచుతుంది. ఇది మార్కెట్ లో చౌకగా లభిస్తుంది. కేవలం రూ.10 మాత్రమే కొనుగోలు చేయవచ్చు. కనుక ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు  పెరుగు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సత్తు

సత్తును ‘పేదవారి ప్రోటీన్’ అని పిలుస్తారు. సత్తు అనేది పౌడర్ బెంగాల్ గ్రాము లేదా ఇతర పప్పులు, తృణధాన్యాల నుండి తయారు చేయబడిన ప్రోటీన్-రిచ్ పౌడర్. ఇది జార్ఖండ్, బీహార్, పంజాబ్, ఉత్తరాఖండ్ , UP వంటి భారతదేశంలోని అనేక ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు సూపర్ మార్కెట్‌లలో కూడా సులభంగా లభించే ప్రసిద్ధ ఆహార పదార్ధం. సత్తు ఇప్పుడు గోధుమ, బార్లీ లేదా జొన్న (జోవర్) వంటి వివిధ రూపాల్లో అందుబాటులో ఉంది. ఇది జనాదరణ పొందిన మరియు సూపర్‌ఫుడ్‌గా గుర్తింపు పొందిన తాజా ఆహారం కేవలం కొన్ని రూపాయలకే మార్కెట్‌లో లభించే వేసవిలో బెస్ట్ డ్రింక్. మనల్ని హీట్ స్ట్రోక్ నుండి రక్షిస్తుంది. రెండు చెంచాల సత్తును ఒక గ్లాసు నీటిలో వేసి ఉదయాన్నే తాగాలి. మీరు రోజంతా వేడి నుండి రక్షించబడతారు. తక్షణ శక్తిని కూడా ఇస్తుంది.

కీర దోసకాయ  వేసవిలో నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు బెస్ట్ ఫుడ్. కీర దోసకాయ దాదాపు 90 శాతం నీటితో నిండిడి ఉంటుంది. దీంతో  కీర దోసకాయ వేసవిలో ఉత్తమ ఆహారంగా పరిగణించబడుతుంది. ఇది చౌకైన వస్తువు కూడా. కావాలంటే దోసకాయ పానీయంగా లేదా ఆహారంలో సలాడ్‌గా తీసుకోవచ్చు. వేసవిలో ప్రతిరోజూ ఒక కీర దోసకాయ తినాలి.

నిమ్మరసం వేసవిలో హైడ్రేటెడ్‌ బారిన పడకుండా ఉండడానికి ఉత్తమ డ్రింక్ నిమ్మరసం. విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మరసం ఉత్తమ పానీయం. మార్కెట్‌లో 10 రూపాయలకు కనీసం 3 నిమ్మకాయలు లభిస్తాయి. రోజుకు ఒకసారైనా నిమ్మ రసం తో తయారు చేసిన డ్రింక్  లేదా ఇతర పానీయాలు త్రాగండి..  వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..