AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: మీ బ్యూటీ కిట్‌లో ఇవి ఉన్నాయా.. లేకుంటే వెంటనే ఇలా చేయండి..

పట్టులాంటి చర్మం కోసం ఇలా చేయండి..? మెరిసే జట్టు కోసం అలా చేయండి.. అని మనం ఇప్పటి వరకు చాలా చదవి ఉంటాం. ఆ చిట్కాలతో ఎంతో కొంత ఫలితం వచ్చి ఉంటుంది. కానీ..

Skin Care Tips: మీ బ్యూటీ కిట్‌లో ఇవి ఉన్నాయా.. లేకుంటే వెంటనే ఇలా చేయండి..
Herbal Products
Sanjay Kasula
|

Updated on: Dec 26, 2021 | 11:30 AM

Share

పట్టులాంటి చర్మం కోసం ఇలా చేయండి..? మెరిసే జట్టు కోసం అలా చేయండి.. అని మనం ఇప్పటి వరకు చాలా చదవి ఉంటాం. ఆ చిట్కాలతో ఎంతో కొంత ఫలితం వచ్చి ఉంటుంది. కానీ నిత్యం ఇలా చేస్తే మీకు మెరిసే ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. అదే సమయంలో చాలా మంది చర్మ సంరక్షణ కోసం మార్కెట్‌లో లభించే ఖరీదైన ఉత్పత్తులనే వాడుతుంటారు. ఈ ఉత్పత్తులు చర్మానికి ఉపయోగపడతాయనే సత్యాన్ని మీరు విశ్వసిస్తే మీరు మోసపోయినట్లే. ఈ ఖరీదైన ఉత్పత్తులు చర్మానికి హాని కలిగించే అనేక రసాయనాలతో తయారు చేయబతాయి. ఇవి మీకు కొంత కాలంపాటు మంచి ఫలితాలను ఇవ్వగలవు.. కానీ ఆ తర్వాత చర్మానికి హాని కలిగిస్తాయి. ఇందుకు బదులుగా మీరు మీ బ్యూటీ కిట్‌లో మూలికా ఉత్పత్తులను ఒక భాగంగా చేసుకోండి. విశేషమేమిటంటే అవి సహజమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇతర ఉత్పత్తుల నుండి భిన్నంగా ఉండటానికి ఇదే కారణం.

హెర్బల్ లిప్ బామ్‌

చలికాలంలో పెదవులు పగుళ్లు ఏర్పడడం.. వాటిల్లో గాయాలు ఏర్పడడం వంటివి సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో ప్రజలు మార్కెట్‌లో ఉన్న వివిధ రకాల లిప్ బామ్‌లను ఉపయోగించడం మొదలు పెడతారు. అవి మీకు కొంత సమయంపాటు ఉపశమనం ఇస్తాయి. కానీ ఆ తర్వాత హానిని కూడా కలిగిస్తాయి. ఇందుకు బదులుగా హెర్బల్ లిప్ బామ్స్ సహాయం తీసుకోండి. దీంతో పెదాలు మృదువుగా ఉండడంతోపాటు ఆరోగ్యంగా కూడా మారుతాయి.

హెర్బల్ షాంపూ

చలికాలంలో వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టులో చుండ్రు వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ సమయంలో జుట్టుకు సంబంధించిన అనేక ఇతర సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రసాయనాలతో తయారైన ఉత్పత్తులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. అటువంటి పరిస్థితిలో హెర్బల్ షాంపూలను ఆశ్రయించండి. ఎందుకంటే అవి కలబంద, వేప వంటి సహజ వస్తువులను కలిగి ఉంటాయి.

హెర్బల్ బాడీ లోషన్

హెర్బల్ బాడీ లోషన్ చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా ఎక్కువ కాలం హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయ పడుతాయి. రసాయనాలతో తయారైన బాడీ లోషన్లు ఎంత ఖరీదైనవి అయినప్పటికీ అవి చర్మానికి మేలు చేయవని తెలుసుకోండి. హెర్బల్ బాడీ లోషన్‌ను కిట్‌లో భాగంగా చేసుకోండి. చర్మం పొడిబారడం.. దురద సమస్యను తొలగించుకోండి.

హెర్బల్ ఫేస్ వాష్

కెమికల్స్‌తో చేసిన ఫేస్ వాష్‌లు చర్మానికి సరిపోకపోతే ముఖంపై మొటిమలు, మొటిమలు.. ఇతర సమస్యలు వస్తాయి. అందువల్ల హెర్బల్ ఫేస్ వాష్‌ను దినచర్యలో భాగంగా చేసుకోండి. ఎందుకంటే అవి ముఖంపై ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించవు.

హెర్బల్ అయిల్

ఇప్పుడు మనం వింటర్ సీజన్‌లో ఉన్నాం. జుట్టు  పొడి, డల్‌నెస్‌ను తొలగించడానికి తప్పనిసరిగా వారానికి రెండుసార్లు ఆయిల్ మసాజ్ చేయాలి. మీరు వాటిని ఆరోగ్యంగా, అందంగా మార్చడంలో సహాయ పడుతాయి.  

ఇవి కూడా చదవండి: New Year Recipe: న్యూ ఇయర్ వేడుకల్లో మోజారెల్లా స్టిక్స్ మీ కుటుంబ సభ్యులను ఖుష్ చేయండి.. వీటి ఇలా ట్రై చేయండి..

Trending Video: అయ్యో..! ఆపదలో పప్పి.. చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా..

Follow Us
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..