Orange peels for Skin: నారింజ తొక్కలతో మీ చర్మ అందాన్ని పెంచేయండి..
చర్మాన్ని అందంగా మార్చడంలో నారింజ తొక్కలు ఎంతో చక్కగా పని చేస్తాయి. నారింజ తొక్కలతో చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. వీటితో చర్మాన్ని గ్లోయింగ్‌గా మార్చుకోవచ్చు..
అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా అందం విషయంలో అస్సలు రాజీ పడరు ఆడవాళ్లు. తమ అందాన్ని పెంచేందుకు ఎన్నో రకాల బ్యూటీ ప్రాడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వీటితో పాటు ఇంట్లో కొన్ని రకాల బ్యూటీ టిప్స్ కూడా ఫాలో చేస్తూ ఉంటారు. మీరు ఉపయోగించే బ్యూటీ ప్రాడెక్ట్స్ కంటే ఇంట్లో ఉపయోగించే ఈ నారింజ తొక్కలతో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. నారింజ తొక్కల్లో కూడా అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి చర్మాన్ని అందంగా మార్చడంలో ఎంతో చక్కగా ఉపయోగ పడతాయి. నారింజ తొక్కతో ఎన్నో రకాల చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. మచ్చలు, ముడతలను తగ్గించి.. స్కిన్‌ని గ్లోయింగ్‌గా చేయడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది. ఎన్నో రకాల బ్యూటీ ప్రాడెక్ట్స్‌లో కూడా నారింజ తొక్కలను ఉపయోగిస్తూ ఉంటారు. మరి నారింజ తొక్కలను ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
స్క్రబ్:
ఫేస్‌కి స్క్రబ్ చాలా ముఖ్యం. స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై ఉండటం వల్ల మృత కణాలు పోయి, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ పోతాయి. నారింజ తొక్కలను శుభ్రంగా కడిగి.. ఎండలో బాగా ఎండపెట్టాలి. ఇవి బాగా ఎండిపోయాక మిక్సీలో వేసి పొడిలా చేసుకోండి. ఇందులో కొద్దిగా చక్కెర, తేనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి.. ఫేస్‌కి స్క్రబ్ చేసుకుంటే.. చర్మంపై ఉండే దుమ్ము, మురికి పోయి.. క్లియర్‌గా గ్లోయింగ్‌గా మారుతుంది. స్కిన్ కూడా సాఫ్ట్‌గా మారుతుంది.
ఫేస్ ప్యాక్స్:
నారింజ తొక్కల పొడితో ఎన్నో రకాల ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. ఈ నారింజ తొక్కల పొడిలో టమాటా రసం, పెరుగు, పాలు, ఆలివ్ ఆయిల్, తేనె ఏది కలిపి రాసుకున్నా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఈ ప్యాక్ పావు గంట సేపు ఉంచి.. ఫేస్ కడిగిస్తే.. సాఫ్ట్‌గా కాంతివంతమైన చర్మం మీకు లభిస్తుంది.
టోనర్:
నారింజ తొక్కలను ఉపయోగించి టోనర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టోనర్‌తో ముఖం ఫ్రెష్‌గా, అందంగా మారుతుంది. నారింజ తొక్కలను శుభ్రంగా కడిగి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకున్నా, టోనర్‌గా ఉపయోగించినా.. మచ్చలు, ముడతలు పోయి ముఖం గ్లోయింగ్‌గా మారుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..