Tender Coconut vs Raw Coconut: లేత కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి.. వీటిల్లో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..

కొబ్బరి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరిలో మూడు రకాలు ఉంటాయి. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, లేత కొబ్బరి. వీటిల్లో ఏది తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నింటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది వంటల్లో కూడా కొబ్బరిని ఉపయోగిస్తూ ఉంటారు. వంటను బట్టి కొబ్బరిలోని రకాలను ఉపయోగిస్తూ ఉంటారు. కొబ్బరితో చాలా రకాల వంటలు చేయవచ్చు. కొబ్బరి తినడం వల్ల చర్మానికి..

Tender Coconut vs Raw Coconut: లేత కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి.. వీటిల్లో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..
Tender Coconut Vs Raw Coconut
Follow us

|

Updated on: Aug 02, 2024 | 2:40 PM

కొబ్బరి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరిలో మూడు రకాలు ఉంటాయి. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, లేత కొబ్బరి. వీటిల్లో ఏది తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నింటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది వంటల్లో కూడా కొబ్బరిని ఉపయోగిస్తూ ఉంటారు. వంటను బట్టి కొబ్బరిలోని రకాలను ఉపయోగిస్తూ ఉంటారు. కొబ్బరితో చాలా రకాల వంటలు చేయవచ్చు. కొబ్బరి తినడం వల్ల చర్మానికి, జుట్టుకు చాలా మంచిది. ఈ కొబ్బరి నుంచే కొబ్బరి నూనె తీస్తారు. మరి ఏ కొబ్బరి తింటే ఎలాంటి లాభాలు అందుతాయో.. ఏ విధంగా మేలు చేస్తుందో.. వీటిల్లో ఏది తినడం వల్ల మనకు పోషకాలు అనేవి సరైన స్థాయిలో అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేత కొబ్బరి:

లేత కొబ్బరిలో ఐరన్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్, ఫైబర్, పొటాషియం, లారిక్ యాసిడ్, చైన్ ట్రైగ్లిజరైడ్స్, విటమిన్లు వంటివి లభిస్తాయి. లేత కొబ్బరి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు. డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ లేత కొబ్బరి మితంగా తీసుకోవచ్చు. ఈ లేత కొబ్బరి తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. లేత కొబ్బరి తింటే గర్భిణీలకు కూడా చాలా మంచిది.

పచ్చి కొబ్బరి:

పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాపర్, సెలీనియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్, ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలెట్ లభిస్తాయి. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ లెవల్స్‌ని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా చక్కగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటీస్ కూడా కంట్రోల్ చేస్తుంది. బరువు కూడా తగ్గొచ్చు.

ఇవి కూడా చదవండి

ఏది తింటే మంచిది:

ఈ రెండింటిలో ఏది తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే లేత కొబ్బరి ఎంత తీసుకున్నా పర్వాలేదు. కానీ పచ్చి కొబ్బరి మాత్రం మితంగా తీసుకోవాలని అంటున్నారు. పచ్చి కొబ్బరి ఎక్కువగా తింటే.. దగ్గు, నెమ్ము వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ లేత కొబ్బరితో అలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి పచ్చి కొబ్బరి కంటే లేత కొబ్బరిని ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేత కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి.. వీటిల్లో ఏది తింటే మంచిది..
లేత కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి.. వీటిల్లో ఏది తింటే మంచిది..
తెలంగాణ ‘సెట్‌ 2024’ పరీక్ష తేదీల మార్పు.. కొత్త షెడ్యూల్‌ ఇదే
తెలంగాణ ‘సెట్‌ 2024’ పరీక్ష తేదీల మార్పు.. కొత్త షెడ్యూల్‌ ఇదే
యూజీసీ నెట్‌ 2024 రీ-ఎగ్జాం షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల తేదీలివే
యూజీసీ నెట్‌ 2024 రీ-ఎగ్జాం షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల తేదీలివే
ఈ బెస్ట్ ఫుడ్స్ తీసుకుంటే.. కళ్ల సమస్యలు రానే రావు..
ఈ బెస్ట్ ఫుడ్స్ తీసుకుంటే.. కళ్ల సమస్యలు రానే రావు..
బొప్పాయి సాగుతో రూ.15 లక్షల వరకు ఆదాయం.. అద్భుతమైన బిజినెస్‌
బొప్పాయి సాగుతో రూ.15 లక్షల వరకు ఆదాయం.. అద్భుతమైన బిజినెస్‌
అలా చేస్తే ఐపీఎల్ నుంచి 2 ఏళ్లపాటు నిషేధించాలి: కావ్య మారన్
అలా చేస్తే ఐపీఎల్ నుంచి 2 ఏళ్లపాటు నిషేధించాలి: కావ్య మారన్
రుద్రాణికి ఇందిరా దేవి మాస్ వార్నింగ్.. అప్పూ చెంతకే కళ్యాణ్!
రుద్రాణికి ఇందిరా దేవి మాస్ వార్నింగ్.. అప్పూ చెంతకే కళ్యాణ్!
ఆ సినిమా ఎఫెక్ట్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ మీద పడనుందా ??
ఆ సినిమా ఎఫెక్ట్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ మీద పడనుందా ??
కృతి సనన్‌ ప్రేమలో పడ్డారా ??బాలీవుడ్ లో హాట్ టాపిక్‌
కృతి సనన్‌ ప్రేమలో పడ్డారా ??బాలీవుడ్ లో హాట్ టాపిక్‌
దేశంలో అసలైన హెర్బాలైఫ్‌ ఉత్పత్తులను పొందడం ఎలా? ప్రయోజనాలు ఏంటి?
దేశంలో అసలైన హెర్బాలైఫ్‌ ఉత్పత్తులను పొందడం ఎలా? ప్రయోజనాలు ఏంటి?