మీ బ్లడ్ షుగర్ నార్మల్‌గా ఉండాలంటే.. ఇవి వారానికి నాలుగు తింటే చాలు.. మధుమేహానికి బైబై చెప్పొచ్చు..
ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది మధుమేహం. దీర్ఘకాలం బాధించే ఈ మొండి వ్యాధిని నయం చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. దీనికి ఇంకా నివారణ లేదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేయడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చని అంటున్నారు. బ్లడ్ షుగర్‌తో బాధపడుతున్న వారు వైద్యుల సలహా మేరకు సరైనా ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం.

టైప్ 2 డయాబెటిస్ కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా పెరుగుతోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ షుగర్ వెంటాడుతోంది. అయితే, డయాబెటిక్ పేషెంట్స్ ఏం తింటారో దాన్ని బట్టి వారి బ్లడ్ షుగర్ కంట్రోల్ లోకి వస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రించే లేదా సాధారణీకరించే అద్భుత ఆహారం గుడ్లు. సరైన మోతాడులో గుడ్లు తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే..
గుడ్లు తినడం వల్ల చాలా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారికి గుడ్లు తినడం చాలా మంచిది. అంతేకాదు… గుడ్లు తినేవారిలో మధుమేహం సమస్యలు సులభంగా నియంత్రణలో ఉంటుందని పేర్కొన్నారు. గుడ్డు తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం తగ్గి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని పలు అధ్యయనాలు నిరూపించాయి.
వారానికి నాలుగు గుడ్లు తింటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. నాలుగు కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల అదనపు ప్రయోజనం ఉండదు అంటున్నారు నిపుణులు. వారానికి నాలుగు గుడ్లు తినడం వల్ల గ్లూకోజ్, మెటబాలిజం, ఇన్ఫ్లమేషన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఉదయాన్నే గుడ్డు తింటే అది మరింత ప్రయోజనకరంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)