Winter Super Foods: వింటర్ సీజన్‌లో ఈ ఫుడ్స్ తింటే బాడీ వెచ్చదనంగా ఉంటుంది..
శీతా కాలంలో ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనేక రోగ్యాల బారిన పడక తప్పదు. అలాగే చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవాలి. ఈ ఆహారాలు తింటే శరీరం వెచ్చగా మారుతుంది..
శీతా కాలంలో ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ కాలంలో హెల్త్ పరంగా అనేక సమస్యలు రాక తప్పదు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. త్వరగా సీజనల్ వ్యాధులు కూడా ఎటాక్ అవుతూ ఉంటాయి. ఈ సీజన్‌లో శరీరానికి శక్తి అనేది చాలా అవసరం. అందులోనూ చలి తీవ్ర రోజు రోజుకూ పెరుగుతుంది. దీంతో శరీరంలో కూడా ఉష్ణోగ్రత లెవల్స్ తగ్గుతాయి. దీంతో తీవ్రంగా చలి, కండరాల నొప్పులు, ఇతర సమస్యలు రావచ్చు. కాబట్టి కొన్ని రకాల ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాలి. మరి చలి కాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా, వెచ్చదనంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్లు – చికెన్:
ఈ సీజన్‌లో ఎక్కువగా గుడ్లు, చికెన్ తీసుకోవాలి. ఇవి వేడి చేసే ఆహారాల. శరీరంలో ఉష్ణోగ్రత లెవల్స్‌ని పెంచుతాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. శరీరానికి శక్తిని ఇస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలసట, నీరసాన్ని దూరం చేస్తాయి. శరీరాన్ని వేడిగా ఉంచడంలో ఈ ఆహారాలు ఖచ్చితంగా సహాయ పడతాయి. కాబట్టి ఈ సీజన్‌లో ఎక్కువగా గుడ్లు, చికెన్ ఉండే ఫుడ్స్ తీసుకోండి.
అల్లం:
ఈ సీజన్‌లో అల్లాన్ని కూడా ఎక్కువగా తీుకోవాలి. అల్లం చలిని తగ్గించి.. శరీరంలో వెచ్చదనాన్ని పెంచుతుంది. ప్రతి రోజూ అల్లం టీ తాగినా, అల్లంతో చేసిన ఆహారాలు తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
పసుపు:
పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ కాలంలో పసుపును కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. పసుపులో కూడా వేడి చేసే గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు త్వరగా ఇన్ ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా, శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్ తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇతర సీజన్ల కంటే ఈ సీజన్‌లో పౌష్టికరమైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. వీటి కారణంగా ఎంతో హెల్దీగా ఉంటారు. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది.
సూప్స్:
ఈ సీజన్‌లో సూప్స్ ఎక్కువగా తీసుకోవాలి. సూప్స్‌లో ఘాటుగా ఉండే పదార్థాలను వాడతారు. వేడి వేడి సూప్స్ తాగడం వల్ల.. శరీరం వెచ్చగా మారుతుంది. దీంతో చలి తక్కువగా పెడుతుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు. అంతే కాకుండా నెయ్యి, మిరియాలు, కూరగాయలు, తృణ ధాన్యాలు కూడా తీసుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..