ఈ అరటి పండు ఖరీదు అక్షరాల రూ. 52 కోట్లు

02 December 2024

TV9 Telugu

గోడకు అంటుకున్న ఈ అరటిపండు ఖరీదు అక్షరాలా రూ.52 కోట్లు. ఈ అరటిపండును మొదట ఓ వ్యాపారవేత్త కొని తిన్నాడు.

గోడపై అంటించిన టేప్ నుండి అరటిపండును తీసి తిన్న వ్యక్తి క్రిప్టో వ్యాపారవేత్త జస్టిన్ సన్. అతను తిన్న అరటిపండు విలువ రూ. 52 కోట్లు.

ఇది మామూలు అరటిపండు కాదు, న్యూయార్క్‌లో వేలం వేసిన ఆర్ట్‌వర్క్. ఇది ప్రముఖ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ కళాకృతి. ఈ కళాకృతికి 'కమెడియన్' అని పేరు పెట్టారు.

ఈ ఆర్ట్‌వర్క్ కోసం వేలం రూ. 676 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత జస్టిన్ సన్ రూ. 52 కోట్లకు కొనుగోలు చేశారు.

ఈ అరటిపండు తింటానని జస్టిన్ సన్ ముందే ప్రకటించాడు. భవిష్యత్తులో ఈ కళాఖండం చరిత్రలో భాగమవుతుందని అని అన్నారు.

అరటిపండు తిన్న తర్వాత జస్టిన్ సన్ మాట్లాడుతూ.. ఈ అరటిపండు రుచి ఇతర సాధారణ అరటిపండ్ల కంటే భిన్నంగా ఉందని, చాలా బాగుందని చెప్పారు.

ఈ కళాకృతి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ జస్టిన్ సన్ , ఇది ఒక కళ మాత్రమే కాదు, ఇది కళ, మీమ్స్, క్రిప్టోకరెన్సీ కమ్యూనిటీ ప్రపంచాలను కలిపే సంస్కృతిని సూచిస్తుందన్నారు.

ఈ కళాకృతి సమాజంలో హాస్యాన్ని, వ్యంగ్యాన్ని ప్రదర్శిస్తుందని కళాఖండాన్ని రూపొందించిన కాటెలాన్ చెప్పారు.