చలికాలంలో ఈ డ్రింక్స్ చాలు.. బరువు సమస్య దూరం.. 

01 December 2024

TV9 Telugu

వేడి పానియాలు.. శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. కేలరీలు సులభంగా కరిగిపోతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఒక గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే విటమిన్ సి అందుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ను దూరం పెడుతుంది.

ఇది కడుపుని శుభ్రపరుస్తుంది. జీవక్రియను పెంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన కాలుష్యాలను బయటకు పంపుతుంది.

చలికాలంలో వెచ్చగా ఉండటానికి, బరువు తగ్గడానికి గ్రీన్ టీ మంచి పానీయం. దీనిలో ఎంజైమ్‌లు, కెఫిన్.. కొవ్వును విచ్ఛిన్నం చేస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి.

ముందు రోజు రాత్రి ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా సోపును నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి ఆ నీటిని తాగాలి.

చలికాలంలో ఈ నీరు శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందించడంలో సహాయపడుతుంది. బరువు కూడా త్వరగా తగ్గుతారు.

చలికాలంలో మధుమేహంతో బాధపడేవారు దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు.

దాల్చిన చెక్క టీలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.