వేరుశనగల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వీటిలో ఉండే అధిక ప్రొటీన్లు, ఫైబర్ కంటెంట్ కడుపుకు సంతృప్తినిచ్చి, అధిక ఆకలిని అడ్డుకుంటాయి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు.
TV9 Telugu
వేరుశనగలను ఉడకించుకుని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఉడకబెట్టిన పళ్లీలను మీ రోజూ వారీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!
TV9 Telugu
ఉడికించిన వేరుశనగల్లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, వివిధ విటమిన్లు, ఖనిజాలతో సహా శరీరానికి అవసరమైన పోషకాలెన్నో ఉంటాయి.
TV9 Telugu
ఇందులో మోనోసాచురేటెడ్, పాలీఅన్ సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొవ్వులు. మితంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
TV9 Telugu
ఉడికించిన పళ్లీల్లో రెస్వెరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నియంత్రిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి, వాపు సమస్యలను తగ్గిస్తుంది.
TV9 Telugu
ఉడికించిన వేరుశనగల్లో ఉండే ఫైబర్ కంటెంట్ చక్కెర శోషణను తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. షుగర్ బాధితులకు ఉడకబెట్టిన పళ్లీలు మంచి ఆహారంగా పనికొస్తుంది.
TV9 Telugu
మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఫోలేట్, నియాసిన్ వంటి పోషకాలు ఉడికించిన వేరుశనగల్లో మెండుగా ఉంటాయి.
TV9 Telugu
ఉడికించిన వేరుశనగలో డ్రైఫ్రూట్స్‌తో సమానమైన పోషకాలు ఉంటాయి. విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. అవయవాల ఎదుగుదలకు కావల్సిన బి కాంఫ్లెక్స్ విటమిన్లు లభ్యమవుతాయి.