Gold Price: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. భారీగా పెరగనున్న బంగారం ధర.. వివరాలు ఇవిగో

బంగారం కొనే వారికి బిగ్ అలర్ట్.. పసిడి ఇంక పైపైకే.. మీకు ఇప్పుడు బంగారం కొనే ఆలోచన ఉందా.? అయితే.. ఇప్పుడే కొనేయండి. ఎందుకంటే.. బంగారం కూడా పుష్ప మాదిరిగానే తగ్గేదేలే అంటోంది. మున్ముందు గోల్డ్ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.

Gold Price: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. భారీగా పెరగనున్న బంగారం ధర.. వివరాలు ఇవిగో
Gold PriceImage Credit source: Getty Images
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 02, 2024 | 12:00 PM

బంగారం ధరల పెరుగుదలకు కూడా ఎన్నో కారణాలున్నాయి. లేటెస్ట్‌గా గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2025లో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరుకుంటుందని చెబుతోంది గోల్డ్‌మ్యాన్ సాచ్స్. ఔన్సు బంగారం ధర వచ్చే నెలలో 2వేల900 డాలర్లకు, వచ్చే ఏడాది చివరికి 3వేల 150 డాలర్లకు పెరుగుతుందని గ్లోబల్‌ కంపెనీ జోస్యం చెప్పింది. సెంట్రల్ బ్యాంకుల నుంచి ఉన్న డిమాండ్, అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ.. బంగారం ధరలు అమాంతం పెరిగేలా చేస్తాయని చెబుతున్నారు.. మరోవైపు దేశాల మధ్య రాజకీయ యుద్ధాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి. వీటన్నింటి ఎఫెక్ట్‌తో.. వచ్చే ఏడాది బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇది చదవండి: ఉన్నట్టుండి స్టేషన్‌లో ఖైదీ మిస్సింగ్.. ఊరంతా గాలించారు.. సీన్ కట్ చేస్తే

బంగారం ధరలు పెరిగేందుకు పరోక్షంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా మరో కారణమంటున్నారు. అటు ట్రంప్‌ తాను అధికారం చేపట్టాక వడ్డీ రేట్లు తగ్గిస్తామని ట్రంప్ ప్రకటించడంతో.. ఇన్వెస్టర్లంతా గోల్డ్ మీదకు షిఫ్ట్ అవుతున్నారు. ఇది కూడా బంగారం రేటు పెరిగేందుకు మరో కారణంగా చెబుతున్నారు. అంతేకాదు.. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు కూడా మంచి రేటు ఇస్తూ.. బంగారం కొనుగోళ్లను పెంచుతున్నాయి. ఇదిలాగే కంటిన్యూ అయితే.. 2025 గోల్డ్ రేట్లు ఊహించని స్థాయికి వెళతాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అందువల్ల.. ఇప్పుడే బంగారం కొనుగోలు చేసి పెట్టుకున్న వాళ్లకు ఆందోళన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది చదవండి: నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి