Telangana: ఆ గ్రామంలో మందుబాబులకు నో ఎంట్రీ.. చుక్క వేస్తే చుక్కలు చూడాల్సిందే.. ఎక్కడంటే

జల్సాలకు కోసం దొంగతనాలు అలవాటు పడ్డ దొంగలు, రేకుల షెడ్డుతో ఏర్పాటు చేసిన దుకాణాలను టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా..

Telangana: ఆ గ్రామంలో మందుబాబులకు నో ఎంట్రీ.. చుక్క వేస్తే చుక్కలు చూడాల్సిందే.. ఎక్కడంటే
LiquorImage Credit source: Getty Images
Follow us
P Shivteja

| Edited By: Ravi Kiran

Updated on: Dec 02, 2024 | 11:53 AM

అదో చిన్న గ్రామం. కానీ వారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. గ్రామం అంత కలిసి ఓకే మాటమీద 12 సంవత్సరాలుగా ఉండడం అంత ఆశమాషీ వ్యవహారం కాదు. వాళ్ల నిర్ణయం వల్ల చాలా వరకు గొడవలు తగ్గాయి. ఇంతకీ అది ఏ గ్రామం. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలియాలి అంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

మెదక్ జిల్లా అల్లదుర్గ్ మండలంలోని కాగిదంపల్లి గ్రామం గత కొన్ని రోజులుగా ఆ గ్రామం ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది..గత 12 ఏళ్లుగా ఈ గ్రామంలో పూర్తిగా మద్యపాన నిషేధం అమలు జరుగుతోంది. మద్యం తాగినా, విక్రయించినా జరిమానాతో పాటు ఇతర శిక్షలు వేస్తామని, గ్రామస్థులు అందరూ కలిసి దృఢ నిశ్చయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాదు.. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. గ్రామంలో ఒకవేళ ఎవరికైనా అలవాటు ఉంటే, అది మానుకునే వరకు ఇతర గ్రామాల్లో సేవించాలని నిబంధనలు విధించారు. ఇక ఆ గ్రామంలో ఎక్కడైనా మద్యం సీసా కనబడితే, సాయంత్రం రచ్చ బండ దగ్గర పంచాయితీకి రావాల్సిందేనని హెచ్చరికలు కూడా జారీ చేశారు. పన్నేండేళ్ల క్రితం గ్రామంలో పూర్తిగా మద్యపానాన్ని నిషేధించాలని, గ్రామపెద్దలు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు.

ఇది చదవండి: నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్

దీనికి ఇప్పటికి గ్రామస్థులందరూ కట్టుబడి ఉండాలని తీర్మానించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకుని 12 ఏళ్లు పూర్తయ్యింది. అయినా వారి నిర్ణయంలో ఎటువంటి మార్పు రాకపోగా.. గ్రామస్థులు అందరు ఏకతాటిపై నడుస్తూ సోదరభావంతో ముందుకెళ్తున్నారు. కాగిదంపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మరో మూడు గ్రామాల ప్రజలు మద్యపాన నిషేధాన్ని తూచాతప్పక పాటిస్తున్నాయి. అప్పాజీపల్లిలో మద్యపానం సేవించడం వల్ల గొడవలు పెరిగిపోతున్నాయనే కారణంగా నిషేధానికి మూకుమ్మడి తీర్మానానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మద్యం విక్రయిస్తే రూ. 2 లక్షల జరిమానాతో పాటు, సమాచారం ఇచ్చిన వారికి 5 వేల నజరానా ప్రకటించుకున్నారు. నేటికీ అదే మాదిరిగా మద్యపాన నిషేధం సజావుగా సాగుతుండడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయని గ్రామస్థులు అంటున్నారు..నేటి యువత ఎక్కువ శాతం జల్సాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

మరో వైపు కాగిదంపల్లి గ్రామంలో మద్యం షాపులు కూడా లేకపోవడంతో, ఆ దిశగా వారి ఆలోచనలు కూడా వెళ్లడం లేదు. బయటకు వెళ్లినప్పుడు వారి పనులు చూసుకుని సమయానికి తమ ఇళ్లకు చేరుతున్నారు. నేటి తరానికి ఆనాటి పెద్దల తీర్మానం ఎంతగానో ప్రయోజనం చేకూర్చింది. గ్రామస్థులందరూ పూర్తిగా తమ పనుల్లో నిమగ్నమవ్వడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోయాయి. సాయంత్రం కాగానే, పెద్దలందరూ రచ్చబండ వద్ద కలిసి కష్టసుఖాలు మాట్లాడు కుంటారు. అందుకే తమ గ్రామం చుట్టు పక్కల ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు చెబుతున్నారు. కాగిదంపల్లి గ్రామ పెద్దల ఆలోచనలతో బీజం వేసుకున్న మద్యపాన నిషేధం భవిష్యత్ తరాలకు మార్గ నిర్దేశాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న మిగతా గ్రామాలు కూడా కాగిదంపల్లిని ఆద‌ర్శంగా తీసుకుంటే రాష్ట్రంలోనూ క్రైం రేటు కూడా తగ్గే అవకాశమూ లేకపోలేదు. ఏది ఏమైనా కాగిదంపల్లిని చూసి అల్లాదూర్ మండలంలోని అప్పాజీపల్లి, బైరందిబ్బ, ముస్లాపూర్, రాంపూర్‌తో పాటు మరికొన్ని గ్రామాలు మధ్య నిషేధంలో పాల్గొంటున్నాయి.

ఇది చదవండి: ఉన్నట్టుండి స్టేషన్‌లో ఖైదీ మిస్సింగ్.. ఊరంతా గాలించారు.. సీన్ కట్ చేస్తే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..