చలికాలంలో మృదువైన పాదాలు కావాలా..!

02 December 2024

TV9 Telugu

TV9 Telugu

కాలాన్ని బట్టి మారే వాతావరణం అతివల అందాన్ని దెబ్బతీస్తుంది. ఈ క్రమంలో చలికాలంలో సౌందర్య పరిరక్షణ మరింత సవాలని చెప్పచ్చు. పొడి చర్మం, పాదాల పగుళ్లు, జుట్టు నిర్జీవమవడం.. వంటివి ఈ కాలంలో వేదిస్తాయి

TV9 Telugu

ముఖ్యంగా చలికాలంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య పాదాల పగుళ్లు. కొందరిలో ఇవి తీవ్రంగా ఉండి, అడుగే వేయలేని స్థితి కనిపిస్తుంటుంది

TV9 Telugu

పొడి చర్మం కారణంగా, ఎరుపు, మంట, దురద కాకుండా, చర్మం కూడా గరుకుగా మారడం ప్రారంభమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి ఈ చిట్కాలను అనుసరించవచ్చు

TV9 Telugu

పాదాల పగుళ్లకి ముఖ్య కారణం మురికి చేరడంతోపాటు పొడి బారడమే. కాబట్టి, రోజూ పాదాలను శుభ్రంగా కడిగి, మృదువైన వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్‌ రాయాలి

TV9 Telugu

టబ్‌లో పాదాలు మునిగేలా గోరు వెచ్చని నీటితో నింపి, రెండు చెంచాల తేనె వేసి పాదాలను ఉంచాలి. పది నిమిషాలయ్యాక పగిలిన ప్రాంతాన్ని మృదువుగా రుద్దాలి. ఇది సహజసిద్ధ మాయిశ్చరైజర్‌లా పని చేయడమే కాదు, బ్యాక్టీరియానూ దూరం చేస్తుంది

TV9 Telugu

శీతాకాలంలో చేతులకు, పాదాలకు మాయిశ్చరైజర్‌ను రోజుకు రెండు నుంచి మూడు సార్లు రాయాలి. అలాగే ఉదయం, రాత్రి పడుకునే ముందు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలాగే సల్ఫేట్ లేని హ్యాండ్ వాష్‌ను మాత్రమే వాడాలి

TV9 Telugu

చేతులు, కాళ్ళ చర్మం పొడిగా మారినట్లయితే రాత్రి పడుకునే ముందు ఆలివ్ నూనె, కొబ్బరి నూనె లేదా అలోవెరా జెల్‌తో మసాజ్ చేసుకోవాలి. అలాగే చలికాలంలో చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ వల్ల చర్మం కరుకుదనం పెరుగుతుంది. అందువల్ల చేతులు, కాళ్ళు స్క్రబ్బింగ్ చేసుకోవాలి

TV9 Telugu

చల్లని వాతావరణంలో మడమల మీద చర్మంపై త్వరగా పగుళ్లు ఏర్పడుతాయి. అటువంటి పరిస్థితిలో రాత్రి పడుకునే ముందు, పాదాలకు క్రీమ్ రాసుకుని, కాటన్ సాక్స్ ధరించాలి. చలికాలంలో స్నానం చేయడానికి, చేతులు కడుక్కోవడానికి అధిక వేడి నీటిని ఉపయోగించవద్దు