30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా..? పుష్కలమైన ఆరోగ్యం..!
ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు నానబెట్టిన పల్లీలు వరం కంటే ఎక్కువని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. పల్లీలు నానబెట్టి తీసుకోవటం వల్ల క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను సమృద్ధిగా అందుతాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. నానబెట్టిన వేరుశెనగలను బెల్లంతో కలిపి తింటే వెన్నునొప్పి తగ్గుతుంది.

నానబెట్టిన పల్లీలు తినడం వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన వేరుశెనగలు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. నానబెట్టిన వేరుశెనగలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. నానబెట్టిన వేరుశెనగలు జీర్ణశక్తిని పెంచుతాయి. జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. నానబెట్టిన పల్లీలు గుండె ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
నానబెట్టిన వేరుశెనగలు తక్షణ శక్తిని అందిస్తాయి. నానబెట్టిన వేరుశెనగలు పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు అధికంగా కలిగి ఉంటాయి. పరగడుపున నానబెట్టిన వేరుశనగలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నానబెట్టిన వేరుశెనగలు కండరాలను టోన్ చేయడానికి, కండరాల క్షీణతను నివారించడానికి సహాయపడతాయి. ఉదయాన్నే నానబెట్టిన వేరుశెనగను తినడం వల్ల పిల్లలు, పెద్దలలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. వేరుశనగలో మంచి కొవ్వులూ అధికమే. విటమిన్‌ఇ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టుతోపాటు చర్మాన్నీ రక్షిస్తాయి.
ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు నానబెట్టిన పల్లీలు వరం కంటే ఎక్కువని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. పల్లీలు నానబెట్టి తీసుకోవటం వల్ల క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను సమృద్ధిగా అందుతాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. నానబెట్టిన వేరుశెనగలను బెల్లంతో కలిపి తింటే వెన్నునొప్పి తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..