AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Moong Dal: పచ్చి పెసర పప్పు తింటే ఇన్ని సమస్యలు తగ్గించుకోవచ్చా.. తెలుసుకోండి..

ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే మీరు తీసుకునే ఆహారంపై ఆధార పడి ఉంటుంది. సరైన ఆహారం తింటే.. ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అందంగా కనిపిస్తారు. చెడు ఆహారాలు తినడం వల్ల లేని పోని రోగాలు వస్తాయి. బాడీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే హెల్దీగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఆహారమే కీలక పాత్ర పోషిస్తుంది. మీరు తరచూ అనారోగ్య బారిన పడుతున్నారంటే.. అందుకు మీరు తీసుకున్న ఆహారమే కారణం. ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు..

Green Moong Dal: పచ్చి పెసర పప్పు తింటే ఇన్ని సమస్యలు తగ్గించుకోవచ్చా.. తెలుసుకోండి..
Green Moong Dal
Chinni Enni
|

Updated on: Sep 09, 2024 | 4:10 PM

Share

ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే మీరు తీసుకునే ఆహారంపై ఆధార పడి ఉంటుంది. సరైన ఆహారం తింటే.. ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అందంగా కనిపిస్తారు. చెడు ఆహారాలు తినడం వల్ల లేని పోని రోగాలు వస్తాయి. బాడీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే హెల్దీగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఆహారమే కీలక పాత్ర పోషిస్తుంది. మీరు తరచూ అనారోగ్య బారిన పడుతున్నారంటే.. అందుకు మీరు తీసుకున్న ఆహారమే కారణం. ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో పెసర పప్పు కూడా ఒకటి. పెసర పప్పులో శరీరానికి అవసరం అయ్యే పోషకాలు చాలా ఉన్నాయి. పెసర పప్పు తినడం వల్ల శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అందులోనూ పచ్చి పప్పు తింటే మరిన్ని ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తిని పెంచతాయి:

పెసరపప్పు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థ బల పడుతుంది. దీంతో అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. రోగాలు, వ్యాధులు త్వరగా ఎటాక్ చేయకుండా ఉంటాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

వెయిట్ లాస్:

పెసర పప్పులో ఫైబర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెసర పప్పు తినడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఆకలి కూడా ఎక్కువగా వేయదు. దీంతో ఇతర పదార్థాలు తీసుకోలేం. కాబట్టి బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం:

పెసరలో పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కూడా అదుపు చేస్తుంది.

చర్మం ఆరోగ్యం:

పెసర పప్పు తినడం వల్ల మీ చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. చర్మం త్వరగా ముడతలు పడకుండా.. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి.

జీర్ణ క్రియ ఆరోగ్యం:

నానబెట్టిన పచ్చి పెసర పప్పు తినడం వల్ల మీ జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. పొట్టకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ క్రియ అనేది పెరుగుతుంది. ఉదర ఆరోగ్యం పెరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..