AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Capsicum Uses: క్యాప్సికమ్ తింటే ఈ వ్యాధులకు బైబై చెప్పొచ్చు..

క్యాప్సికమ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చైనీస్ వంటలు అంటే క్యాప్సికమ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. క్యాప్సికమ్‌తో రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాప్సికమ్ తినడం వల్ల చాలా రకాల దీర్ఘ కాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. భారత దేశంలో కంటే ఇతర దేశాల్లో క్యాప్సికమ్‌ను ప్రధాన పంటగా భావిస్తారు. క్యాప్సికమ్‌తోనే ఎక్కువగా వంటలు తయారు చేసుకుంటారు. అందుకే దీన్ని ప్రధాన కూరగాయగా..

Capsicum Uses: క్యాప్సికమ్ తింటే ఈ వ్యాధులకు బైబై చెప్పొచ్చు..
Capsicum
Chinni Enni
|

Updated on: Aug 19, 2024 | 4:15 PM

Share

క్యాప్సికమ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చైనీస్ వంటలు అంటే క్యాప్సికమ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. క్యాప్సికమ్‌తో రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాప్సికమ్ తినడం వల్ల చాలా రకాల దీర్ఘ కాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. భారత దేశంలో కంటే ఇతర దేశాల్లో క్యాప్సికమ్‌ను ప్రధాన పంటగా భావిస్తారు. క్యాప్సికమ్‌తోనే ఎక్కువగా వంటలు తయారు చేసుకుంటారు. అందుకే దీన్ని ప్రధాన కూరగాయగా భావిస్తారు. క్యాప్సికమ్ తినడం వల్ల అనేక రకాల పోషకాలు లభిస్తాయి. క్యాప్సికమ్‌ను పచ్చిగా కూడా తినవచ్చు. సలాడ్స్ వంటి వాటిల్లో కూడా క్యాప్సికమ్‌ను యాడ్ చేసుకుని తినవచ్చు. ఉడక బెట్టిన క్యాప్సికమ్ కంటే.. పచ్చిది తింటేనే చాలా రకాల లాభాలు కలుగుతాయి. క్యాప్సికమ్‌తో ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

క్యాప్సికమ్‌ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా క్యాప్సికమ్ తినడం వల్ల చాలా మంచిది.

కళ్ల ఆరోగ్యం:

క్యాప్సికమ్ తినడం వల్ల కళ్ల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో బీటా కెరోటిన్ కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడుతుంది. కంటి చూపును కూడా మెరుగు పరిచి, ఇతర సమస్యలు రాకుండా చేస్తుంది. రే చీకటి సమస్యతో ఇబ్బంది పడేవారు క్యాప్సికమ్ తింటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

రెగ్యులర్‌గా క్యాప్సికమ్ తింటే.. కొలెస్ట్రాల్ లెవల్స్‌ని కూడా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

చర్మ ఆరోగ్యం:

క్యాప్సికమ్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని రక్షణగా నిలుస్తాయి. రెగ్యులర్‌గా క్యాప్సికమ్ తింటే వృద్ధాప్య ఛాయలు, ముడతలు, మచ్చలు ఏర్పడకుండా శరీరాన్ని కాపాడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పులకు చెక్:

క్యాప్సికమ్‌లో ఉండే క్యాప్రైసిన్ సమ్మేళనం.. యూరిక్ యాసిడ్‌ను నియంత్రించేందుకు హెల్ప్ చేస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు అనేవి తగ్గుతాయి. అంతేకాకుండా ఇతర సమస్యలను తగ్గించుకునేందుకు కూడా క్యాప్సికమ్ హెల్ప్ చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us