AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో

ప్రస్తుత రోజుల్లో నేరం అనేది చాలా తేలికైపోయింది. జనాలు కాస్త కూడా భయం లేకుండా నేరాలకు పాల్పడుతున్నారు. చట్టాలు, పోలీసులు అన్నా భయం లేకుండా "ఈ నేరం చేసింది మేమే" అని బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలో వెలుగుచూసింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు అపరిచితులు జిమ్ ఎదుట వర్కౌట్ చేస్తున్న ఓ యువకుడిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

Viral Video: నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
Haryana Gym Owner Murder
Anand T
|

Updated on: Jun 12, 2026 | 3:42 PM

Share

జిమ్ ఎదుట వర్కౌట్ చేస్తున్న ఓ జిమ్ ఓనర్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. జింద్ జిల్లాకు చెందిన కపిల్ రెడు అనే వ్యక్తి హన్సీ ప్రాంతంలోని క్రాంతికారి చౌక్ సమీపంలో ఒక జిమ్ నడుపుతున్నాడు. ఎప్పటిలాగే జూన్ 11వ తేదీ ఉదయం కపిల్ తన క్లయింట్స్‌తో కలిసి జిమ్ సమీపంలో ప్రీ-వర్కౌట్ సెషన్ చేస్తున్నాడు.

ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కపిల్ వెనుక వచ్చి ఆగారు. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి కిందకు దిగి, తన వద్ద ఉన్న గన్‌తో కపిల్‌పై వరుసగా పది రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం వారిద్దరూ మళ్లీ బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కపిల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన అక్కడి వారు కపిల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతను మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

సోషల్ మీడియాలో పోస్ట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం?

అయితే, ఈ ఘటన జరిగిన కాసేపటికే ఈ హత్యకు తానే బాధ్యత వహిస్తున్నట్టు హరి బాక్సర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తిగా అతను చెప్పుకొచ్చాడు. గతంలో షేక్‌పురా, ధని పూరియాలో జరిగిన కాల్పుల ఘటనల్లో కపిల్‌కు కూడా ప్రమేయం ఉందని.. అందుకే అతన్ని చంపాల్సి వచ్చిందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

రంగంలోకి దిగిన పోలీసులు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన కపిల్‌పై కూడా గతంలో నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసుల్లో కపిల్ ఇప్పటికే జైలు శిక్ష అనుభవించి, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నట్టు పేర్కొన్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
ప్రాక్టీస్‌తోనే పవర్ ఫుల్ మెసేజ్ పంపిన టీమిండియా యమ కింకరుడు..
ప్రాక్టీస్‌తోనే పవర్ ఫుల్ మెసేజ్ పంపిన టీమిండియా యమ కింకరుడు..
ఒక్క సినిమాతో మారిపోయిన జాతకం.. మరో స్టార్ హీరో మూవీలో వామికా
ఒక్క సినిమాతో మారిపోయిన జాతకం.. మరో స్టార్ హీరో మూవీలో వామికా
ఆ ఒక్క పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా..
ఆ ఒక్క పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా..
ఇంట్లో శంఖాన్ని ఏ దిక్కులో ఉంచాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం..
ఇంట్లో శంఖాన్ని ఏ దిక్కులో ఉంచాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం..
Video: సొంగడ్డపై ఆస్ట్రేలియాను సస్సుపోయించిన 26 ఏళ్ల బౌలర్..
Video: సొంగడ్డపై ఆస్ట్రేలియాను సస్సుపోయించిన 26 ఏళ్ల బౌలర్..
వారికి కేంద్రం సూపర్ న్యూస్.. ప్రతీ నెలా అధిక మొత్తంలో పెన్షన్
వారికి కేంద్రం సూపర్ న్యూస్.. ప్రతీ నెలా అధిక మొత్తంలో పెన్షన్
అద్దంలో తన ప్రతిబింబం చూసి పాము ఎందుకు వింతగా ప్రవర్తిస్తుంది
అద్దంలో తన ప్రతిబింబం చూసి పాము ఎందుకు వింతగా ప్రవర్తిస్తుంది