AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..

ఇదిలా ఉంటే గుండెపోటు వచ్చిన వారికి సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందుకోసం శరీరం ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తుందని చెబుతున్నారు. వీటిని సమయానికి గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత చికిత్స ప్రారంభిస్తే ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు. అయితే గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు శరీరం కొన్ని రకాల..

Heart Attack: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
Heart Attack
Narender Vaitla
|

Updated on: May 05, 2024 | 8:28 PM

Share

గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృద్రోగాలు ఎక్కువవుతున్నాయి. ఇక తక్కువ వయసున్న వారు కూడా గుండెపోటు బారిన పడుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే గుండెపోటు వచ్చిన వారికి సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందుకోసం శరీరం ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తుందని చెబుతున్నారు. వీటిని సమయానికి గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత చికిత్స ప్రారంభిస్తే ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు. అయితే గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు శరీరం కొన్ని రకాల లక్షణాల ద్వారా మనల్ని అలర్ట్‌ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* అసిడిటి లాంటి ఎలాంటి సమస్య లేకుండా ఛాతిలో నొప్పి వస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అయితే మనలో చాలా మంది ఛాతి నొప్పిని లైట్ తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఛాతి నొప్పి గుండెపోటుకు ప్రాథమిక లక్షణంగా భావించాలి.

* ఇక గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో ఎడమ భుజం, చేయి, వీపు, మెడ, దవడలో నొప్పి రావడం. అకస్మాత్తుగా నొప్పి వచ్చినా, ఎక్కువ సమయం నొప్పి కొనసాగుతున్నా వెంటనే అలర్ట్‌ అవ్వాలి.

* గుండెపోటు వచ్చే ముందకు కనిపించే మరో ప్రధాన లక్షణం చెమటలు పట్టడం. ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా ఉన్నట్లుండి చెమటలు పడితే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

* ఇక ఏ పని చేయకపోయినా.. నిత్యం అలసటగా అనిపిస్తున్నా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

* కొన్ని సందర్భాల్లో అజీర్ణం కూడా గుండెపోటు యొక్క ప్రారంభ లక్షణంగా చెబుతుంటారు. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

* ఇక అకస్మాత్తుగా తల తిరగడం, వాంతులు, వికారంగా అనిపించినా వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి కూడా గుండెపోటుకు ప్రాథమిక లక్షణాలుగా చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..