Summer Fruits: ఈ వేసవి పండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు.. సర్వ రోగాలకు దివ్యౌషధాలు!

పగటి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడి ప్రతాపం ప్రారంభం అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కాస్త కష్టమైన పనే. అయితే, ఈ వేసవి పండ్లు తింటే ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేసవిలో ఎంత తేలికపాటి ఆహారం తీసుకుంటే, ఆరోగ్యానికి అంత మంచిది. అలాగే ఎక్కువ నీరు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా నీటి శాతం అధికంగా ఉండే పండ్లు..

Summer Fruits: ఈ వేసవి పండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు.. సర్వ రోగాలకు దివ్యౌషధాలు!
Summer Fruits
Follow us

|

Updated on: May 05, 2024 | 8:14 PM

పగటి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడి ప్రతాపం ప్రారంభం అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కాస్త కష్టమైన పనే. అయితే, ఈ వేసవి పండ్లు తింటే ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేసవిలో ఎంత తేలికపాటి ఆహారం తీసుకుంటే, ఆరోగ్యానికి అంత మంచిది. అలాగే ఎక్కువ నీరు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా నీటి శాతం అధికంగా ఉండే పండ్లు శరీరానికి పరిపడా నీటిని అందించడంతోపాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. వేసవి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

పుచ్చకాయ

పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. అధిక నీటి శాతం, తక్కువ క్యాలరీలు కలిగిన ఈ పండు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలోని బీటా కెరోటిన్ కళ్ళు, చర్మాన్ని సంరక్షిస్తుంది. పుచ్చకాయలోని లైకోపీన్ వివిధ రకాల క్యాన్సర్ల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

మామిడిపండ్లు

ఏడాదికి కేవలం రెండు నెలలు మాత్రమే మామిడి పండ్లు అందుబాటులో ఉంటాయి. పచ్చి లేదా పండిన మామిడిపండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్ వంటి పదార్థాలు ఇందులో పష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి మలబద్ధకానికి ఉపశమనం పొందడం వరకు మామిడిపండ్లు సహాయపడతాయి. ఇది శరీరంలో కొల్లాజెన్ ఏర్పడటానికి కూడా సహాయపడుతుంది. యూవీ కిరణాల నుంచి కళ్ళను రక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

లిచీ

లిచీ కూడా మామిడికాయల మాదిరిగానే వేసవిలో రెండు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. లిచీలో నీరు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఎక్కువ కేలరీలు ఉండవు. ఈ పండు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా లిచీలో ఐరన్‌, రాగి, మెగ్నీషియం, భాస్వరం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

బొప్పాయి

రోజూ ఒక కప్పు పండిన బొప్పాయిని తింటే వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు చర్మ సమస్యలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. పండిన బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఇ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. పండిన బొప్పాయి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. పండిన బొప్పాయిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

బేరి (పియర్‌ పండ్లు)

బేరిలో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. అంతేకాకుడా బేరి పండ్లు టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో అధిక నీటి కంటెంట్ కారణంగా ఆకలిని తక్కువగా ఉంటుంది. ఈ పండు బరువు తగ్గించడంతోపాటు శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలోనూ సహాయపడుతుంది. బేరి అనేక రకాల క్యాన్సర్ కణాలను కూడా నివారిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం