AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..

అయితే ఇన్ని గుణాలు ఉన్న పాలను సరైన పద్ధతిలో తీసుకోకపోతే మాత్రం నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలను ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల ఆహార పదార్థాల్లో కలిపి తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అయితే కానీ పాలు తాగిన తర్వాత లేదా పాలు తాగడానికి కొన్ని గంటల ముందు...

Health: పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
Milk
Narender Vaitla
|

Updated on: May 05, 2024 | 7:49 PM

Share

పాలు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాలలోని ఎన్నో ఔషధ గుణాలు గుండె జబ్బులు, పక్షవాతం ముప్పుల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎముకల పటుత్వమే కాకుండా గుండె, రక్త నాళాల సమస్య దూరమవుతుంది. పాలలో ఉండే పోటాషియం, మెగ్నీషియం, పెప్టైడ్లు రక్త పోటు తగ్గడానికి ఉపయోగపడతాయి.

అయితే ఇన్ని గుణాలు ఉన్న పాలను సరైన పద్ధతిలో తీసుకోకపోతే మాత్రం నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలను ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల ఆహార పదార్థాల్లో కలిపి తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అయితే కానీ పాలు తాగిన తర్వాత లేదా పాలు తాగడానికి కొన్ని గంటల ముందు లేదా తర్వాత పెరుగును తీసుకోకూడదు.

పాలలో వెల్లుల్లి లేదా ఉల్లిపాయలను తీసుకుంటే అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక పాలలో పొరపాటున కూడా పుల్లటి పండ్లను కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిమ్మకాయలు, స్ట్రాబెర్రీలు, నారింజలు వంటి వాటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు, కడుపులో సమస్యలు వస్తాయి.

ఇక చేపలను కూడా పాలతో కలిపి తీసుకోకూడదు ఇలా చేస్తే జీర్ణ సంబంధిత సమస్యల వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక పాలు తీసుకున్న వెంటనే నాన్‌ వెజ్‌ తింటే కడుపుపై చెడు ప్రభావం పడుతుంది. జీర్ణక్రియతో పాటు చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. ఇక ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్‌ను తీసుకున్న వెంటనే పాలు తాగకూడదు. ఇలా తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ