Health: దంతాలు ఊడిపోతున్నాయా.? మీకు ఆ సమస్య తప్పదు..

దంతాలు ఊడిపోయే వారిలో అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. దంతాలు ఊడిపోవడానికి, మెదడుకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్న దానిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దంతాల నష్టం అల్జీమర్స్‌కు దారి తీస్తుందని అంటున్నారు. చిగుళ్ల వ్యాధితో దంతాలు కోల్పోయిన సమయంలో వాటిలోని...

Health: దంతాలు ఊడిపోతున్నాయా.? మీకు ఆ సమస్య తప్పదు..
Lifestyle
Follow us

|

Updated on: May 05, 2024 | 7:04 PM

పళ్లు ఊడిపోవడం సర్వసాధారణమైన విషయం. అయితే చిన్న వయసులో పళ్లు ఊడిపోయి మళ్లీ వస్తాయి.అలాకాకుండా వయసు పెరుగుతున్నా కొద్దీ దంతాలు ఊడిపోతుంటే మాత్రం అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. దంతాలు క్రమంగా ఊడిపోతున్న వారిలో అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పరిశోధన నిర్వహించి మరీ తెలిపారు.

దంతాలు ఊడిపోయే వారిలో అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. దంతాలు ఊడిపోవడానికి, మెదడుకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్న దానిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దంతాల నష్టం అల్జీమర్స్‌కు దారి తీస్తుందని అంటున్నారు. చిగుళ్ల వ్యాధితో దంతాలు కోల్పోయిన సమయంలో వాటిలోని బ్యాక్టీరియా అల్జీమర్స్​ బారిన పడిన మెదడు ప్రాంతాలపై దాడి చేస్తుందని చెబుతున్నారు.

దంతాలు ఊడిపోవడానికి కారణాలలో పీరియాంటల్ వ్యాధి ఒకటి. క్రమంగా మృదు కణజాలాన్ని నాశనం చేసి, కాలక్రమేణా దంతాలు కోల్పోయేలా ప్రేరేపిస్తుంది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల కారణంగా ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. ప్రో ఇన్​ఫ్లమేటరీ ఏజెంట్లు ప్లాస్మాలో పెరిగినా కూడా మెదడుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ కారణంగానే దంతాల సంరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

దంతాల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తప్పకుండా రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకోవడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం దంతాల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. వీటితో పాటు నిత్యం దంతాలను చెకప్‌ చేసుకోవాలని చెబుతున్నారు. కనీసం 6 నెలలకు ఒకసారైనా వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం