AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: కీళ్ల నొప్పులకు స్మోకింగ్‌కు మధ్య సంబంధం ఏంటి.? నిపుణులు మాట ఇదే..

కీళ్లనొప్పులకు ప్రధాన కారణం ఆర్థరైటిస్. ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. 50 ఏళ్లు నిండిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్య కారణంగా నడవలేరు, కీళ్లు నొప్పులుగా ఉంటాయి. అయితే అర్థరైటిస్‌కు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయని తెలిసిందే...

Lifestyle: కీళ్ల నొప్పులకు స్మోకింగ్‌కు మధ్య సంబంధం ఏంటి.? నిపుణులు మాట ఇదే..
Smoking in AC
Narender Vaitla
|

Updated on: May 05, 2024 | 6:36 PM

Share

ఇటీవల కీళ్ల నొప్పులు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలోనే ఈ సమస్యలు ఎక్కువగా కనిపించేవి. అయితే ప్రస్తుత తరుణంలో తక్కువ వయసులో ఉన్నవారు కూడా కీళ్ల నొప్పుల బారినపడుతున్నారు. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగానే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి.

కీళ్లనొప్పులకు ప్రధాన కారణం ఆర్థరైటిస్. ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. 50 ఏళ్లు నిండిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్య కారణంగా నడవలేరు, కీళ్లు నొప్పులుగా ఉంటాయి. అయితే అర్థరైటిస్‌కు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయని తెలిసిందే. తాజాగా పరిశోధకులు అర్థరైటిస్‌కు ధూమపానం కూడా ఒక కారణమని చెబుతున్నారు. సాధారణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి.

ఇది శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. దీని కారణంగా, రోగనిరోధక వ్యవస్థ శరీర కణజాలాలపై దాడి జరుగుతుంది. దీని కారణంగా, కీళ్లలో నొప్పి, వాపు సమస్యలు వస్తాయి. ఈ సమస్య వల్ల చేతులు, మణికట్, మోకాళ్లలో నిరంతర నొప్పి ఉంటుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తులు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ధూమపానం కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇతర వ్యక్తులతో పోలిస్తే ఎక్కువగా ధూమపానం చేసేవారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అయితే, ఈ వ్యాధికి ధూమపానం కారణం కాదు. ఇది కేవలం ప్రమాద కారకమని అంటున్నారు. అధికంగా స్మోకింగ్ చేసే వారికి ఆ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. కాబట్టి స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..