Beauty: ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..

అయితే వాల్‌నట్స్‌ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోపగడుతుందని మీకు తెలుసా.? ఇందులోని గుణాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖం అందాన్ని రెట్టింపు కూడా చేసుకోవచ్చు. వాల్‌నట్స్‌తో తయారు చేసే స్క్రబ్‌ను ఉపయోగిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇంతకీ వాల్‌నట్స్‌తో స్క్రబ్‌ను ఎలా...

Beauty: ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
Walnut Scrub
Follow us

|

Updated on: May 05, 2024 | 3:03 PM

వాల్‌నట్స్‌ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి. అలాగే ఫ్యాటీ 3 యాసిడ్స్‌ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి. ముఖ్యంగా గర్భిణీలు వీటిని తీసుకుంటే పుట్టబోయే బిడ్డలు తెలివిగా జన్మిస్తారని చెబుతుంటారు. ఇక బ్లడ్ ప్రెజర్‌ మొదలు కీళ్ల నొప్పల వరకు అన్ని రకాల సమస్యలకు వాల్‌ నట్స్‌ దిద్యౌషధంగా ఉపయోగపడుతుంది.

అయితే వాల్‌నట్స్‌ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోపగడుతుందని మీకు తెలుసా.? ఇందులోని గుణాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖం అందాన్ని రెట్టింపు కూడా చేసుకోవచ్చు. వాల్‌నట్స్‌తో తయారు చేసే స్క్రబ్‌ను ఉపయోగిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇంతకీ వాల్‌నట్స్‌తో స్క్రబ్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వాల్‌నట్స్‌తో స్ర్కబ్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా కొన్ని వాల్‌నట్స్‌ను తీసుకోవాలి. అనంతరం వాటిని పొడిగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత వాల్‌నట్స్‌తో చేసిన పౌడర్‌లో కొంచెం తేనెను కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రాన్ని ముఖానికి మంచిగా అప్లై చేసుకోవాలి. ముఖం, మెడలపై అప్లై చేసిన స్క్రబ్‌ చేయాలి.

ఇలా సుమారు 10 నిమిషాల వరకు చేసిన అనంతరం కాసేపు ఆరనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై పేరుకు పోయిన జిడ్డు తగ్గిపోతుంది. ముఖ్యంగా కందిపోయిన చర్మానికి పునర్జీవనం వస్తుంది. ఈ మిశ్రంలో పెరుగు కలుపుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా 10 రోజుల పాటు చేస్తే కచ్చితంగా మార్పు కనిపిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..