- Telugu News Photo Gallery Mental Health App: List Of Mental Health App Which Will Help You Fight Mental Stress
Mobile Apps for Mental Health: మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్ హెల్త్ యాప్స్.. మీ మొబైల్‌లో తప్పక డౌన్‌లోడ్ చేసుకోండి
నేటి కాలంలో మానసిక ఆరోగ్యం అనే అంశం చాలా ముఖ్యమైనదిగా మారింది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని అలవాట్లు, జీవనశైలిలో మార్పులు అవసరం. మానసిక ఆరోగ్యానికి మేలు చేసే అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి మెంటల్ హెల్త్‌ను కాపాడటంలో సహాయం చేస్తాయి. మానసిక ఆరోగ్య యాప్‌లు మానసిక అనారోగ్యాన్ని..
Updated on: May 05, 2024 | 8:29 PM

నేటి కాలంలో మానసిక ఆరోగ్యం అనే అంశం చాలా ముఖ్యమైనదిగా మారింది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని అలవాట్లు, జీవనశైలిలో మార్పులు అవసరం.

మానసిక ఆరోగ్యానికి మేలు చేసే అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి మెంటల్ హెల్త్‌ను కాపాడటంలో సహాయం చేస్తాయి. మానసిక ఆరోగ్య యాప్‌లు మానసిక అనారోగ్యాన్ని నిర్ధారించడంలో సహాయపడకపోవచ్చు. కానీ ఆ సమస్య నుంచి బయటపడటానికి మార్గనిర్దేశం చేస్తాయి.

అలాంటి కొన్ని యాప్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యాప్‌లన్నీ మానసిక ఆరోగ్యానికి ఉత్తమమైనవిగా నిపుణులు సూచిస్తున్నారు.

డేలియో అనే యాప్ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాలలో సహాయం చేయడానికి రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్. ఈ యాప్ వివిధ సమస్యల నివారణకు సేవలను అందిస్తుంది. దీనిని ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అలాగే మానసిక చికిత్స కోసం 'టాక్‌స్పేస్' అనే మొబైల్ యాప్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే iBreath, MindShift, Happify వంటి అనేక యాప్‌లు ధ్యానం చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు నిర్దేశిస్తాయి.




