- Telugu News Photo Gallery Cinema photos Movies shooting update in Tollywood on 04 May 2024 Telugu Entertainment Photos
Entertainment: మై డియర్ దొంగ పై అద్భుతమైన స్పందన.| మహేష్ మూవీకి ముహూర్తం.
అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న సినిమా కుబేర. ధనుష్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి అక్కినేని నాగార్జున లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. వానలో గొడుగు పట్టుకుని నాగ్ నడుచుకుంటూ వెళ్తున్న గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం ఆగస్టులోగానీ, సెప్టెంబర్‌లోగానీ ఉంటుందని అన్నారు మేకర్స్.
Updated on: May 05, 2024 | 6:33 PM

అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన సినిమా మై డియర్ దొంగ. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌లో పాల్టొన్నారు చిత్ర బృందం. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరిస్తున్న తీరు చూస్తే సంతోషంగా ఉందని అన్నారు అభినవ్ గోమటం.

అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న సినిమా కుబేర. ధనుష్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి అక్కినేని నాగార్జున లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. వానలో గొడుగు పట్టుకుని నాగ్ నడుచుకుంటూ వెళ్తున్న గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రేపు సినిమా మొదలయ్యాక అఫీషియల్ లుక్ ఎలా ఉంటుందో అని ఇప్పట్నుంచే కలలు కంటున్నారు మహేష్ అభిమానులు. మ్యాటర్ ఏదైనా.. జస్ట్ తన లుక్స్‌తోనే సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్నారు మహేష్ బాబు.

గత రెండు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మేకోవర్‌లో బిజీగా ఉన్నారు మహేష్.

అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ నెల్లోనే ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభిస్తారు. అయితే అజిత్ లేని సన్నివేశాలను ముందు తెరకెక్కిస్తారు. జూన్ నుంచి అజిత్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది గుడ్ బ్యాడ్ అగ్లీ.

రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కూలీ. ఈ సినిమాలో తన పాటను వాడుకున్నారంటూ ఇసైజ్ఞాని ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. తన అనుమతి లేకుండా, ఇవ్వాల్సిన రాయల్టీ ఇవ్వకుండా ఇలా చేయడం భావ్యం కాదన్నారు. గతంలో లోకేష్ కనగరాజ్ ఇతర సినిమాల్లోనూ తన పాటలను వాడుకున్నారని ప్రస్తావించారు.




