- Telugu News Photo Gallery Cinema photos Hollywood movie News update on May 03 Telugu Entertainment Photos
Tollywood: మా ప్రేమకు పునాది అదే..: జ్యోతిక.| పెళ్లిపై తొలిసారి పరిణితి.
తన పెళ్లి గురించి మాట్లాడారు పరిణీతి చోప్రా. రాఘవ్‌ని తొలిసారి లండన్‌లో ఓ పార్టీలో చూసినట్టు తెలిపారు. మరుసటి రోజు తనతో ఐదు నిమిషాలు మాట్లాడగానే పెళ్లి చేసుకోవాలనిపించిందని అన్నారు. అప్పటికి అతనికి పెళ్లి అయిందో లేదో కూడా తనకు తెలియదని అన్నారు పరిణీతి చోప్రా. సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ప్రసన్నవదనం. ఈ సినిమా మే 3న విడుదల కానుంది.
Updated on: May 05, 2024 | 6:14 PM

బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సీరీస్ రాబోతున్నట్టు ప్రకటించారు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. త్వరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలవుతుందని చెప్పారు.

మాహిష్మతి ప్రజలు అతని పేరును అంతలా జపిస్తున్నప్పుడు, అతని రాకను ఎవరూ ఆపలేరు అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు రాజమౌళి.

తనకు ఇండస్ట్రీలో పరిచయమైన తొలి వ్యక్తి సూర్య అని అన్నారు నటి జ్యోతిక. చాలా కాలం స్నేహితులుగా ఉండి, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. తమ బంధం బలంగా ఉండటానికి పునాది స్నేహమేనని అన్నారు జ్యోతిక. మంచి కథ ఉంటే తప్పకుండా మళ్లీ నటిస్తామని చెప్పారు జ్యోతిక.

తన సోదరుడు సన్నీడియోల్ చెప్పిన మాటలు విని కంట తడి పెట్టుకున్నారు బాబీ డియోల్. 2023 తమకు కావాల్సిన అన్నీ ఇచ్చిందని అన్నారు. ప్రతి కుటుంబానికీ ఓ సూపర్‌మ్యాన్ ఉంటారని, తమ ఫ్యామిలీకి అలాంటి వ్యక్తి సన్నీ అని అన్నారు బాబీ డియోల్. బాబీ సౌత్‌లో ప్రస్తుతం వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నారు.

తన పెళ్లి గురించి మాట్లాడారు పరిణీతి చోప్రా. రాఘవ్‌ని తొలిసారి లండన్‌లో ఓ పార్టీలో చూసినట్టు తెలిపారు. మరుసటి రోజు తనతో ఐదు నిమిషాలు మాట్లాడగానే పెళ్లి చేసుకోవాలనిపించిందని అన్నారు. అప్పటికి అతనికి పెళ్లి అయిందో లేదో కూడా తనకు తెలియదని అన్నారు పరిణీతి చోప్రా.

సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ప్రసన్నవదనం. ఈ సినిమా మే 3న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అర్జున్ వైకె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ , రాశీ సింగ్ హీరోయిన్లు.




