Cranberry Juice: ఈ జ్యూస్ మహిళలకు వరంలాంటిది.. అస్సలు మిస్ చేయకండి!

కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ వీటి గురించి చాలా మందికి తెలీదు. ముఖ్యంగా మహిళలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలు అనేక పనులు చేస్తూ ఉంటారు. ఇవి చేసేందుకు బలం మాత్రమే ఉంటే సరిపోదు. ఎలాంటి రోగాలు, నీరసం, అలసట రాకుండా ఉండేందుకు రోగ నిరోధక శక్తి కూడా చాలా అవసరం. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే ఏ పని అయినా చేయగలరు. ఆరోగ్యంగా ఉండగలరు. ఇప్పుడు చెప్పబోయే ఈ జ్యూస్..

Cranberry Juice: ఈ జ్యూస్ మహిళలకు వరంలాంటిది.. అస్సలు మిస్ చేయకండి!
Cranberry Juice
Follow us

|

Updated on: Jun 06, 2024 | 1:41 PM

కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ వీటి గురించి చాలా మందికి తెలీదు. ముఖ్యంగా మహిళలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలు అనేక పనులు చేస్తూ ఉంటారు. ఇవి చేసేందుకు బలం మాత్రమే ఉంటే సరిపోదు. ఎలాంటి రోగాలు, నీరసం, అలసట రాకుండా ఉండేందుకు రోగ నిరోధక శక్తి కూడా చాలా అవసరం. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే ఏ పని అయినా చేయగలరు. ఆరోగ్యంగా ఉండగలరు. ఇప్పుడు చెప్పబోయే ఈ జ్యూస్ మహిళలకు వరం లాంటిది. క్రాన్బెర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు వంటివి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి.. ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా అడ్డుకుంటాయి.

ముఖ్యంగా మహిళలు.. క్రాన్బెరీతో చేసే జ్యూస్ తాగడం వల్ల మరింత ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మహిళల్లో ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా అడ్డుకునేందుకు క్రాన్బెర్రీ జ్యూస్ బాగా పని చేస్తుంది. అంతే కాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటీస్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. మహిళలు ఈ జ్యూస్ తాగడం వల్ల ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

శరీరంలో మంట తగ్గిస్తుంది:

క్రాన్బెర్రీ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో మంట, దురద, చికాకు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఎంజైమ్స్‌ని పెంచుతాయి. అదే విధంగా యూరిన్‌లో వచ్చే మంట, దురద కూడా తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

వీటి బారిన పడకుండా ఉంటారు:

ప్రస్తుతకాలంలో అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఎటు నుంచి ఎలాంటి రోగాలు వచ్చి ఎటాక్ చేస్తున్నాయో తెలీడం లేదు. ఈ జ్యూస్ తాగడం వల్ల ప్రాణాంతకమైన రూమటాయిడ్ ఆర్ర్థరైటీస్, కాలిటీస్, ఎథెరోక్లోరోసిన్, అల్జీమర్స్ పెరడెంటైటీస్, డయాబెటీస్ వంటి బారిన పడకుండా కాపాడుతుంది.

బాడీని డీటాక్స్ చేస్తుంది:

క్రాన్బెర్రీ‌లో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్స్ ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల ఫినోలిక్ యాసిడ్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. శరీరం నుంచి కోల్పోయినా ఎలక్ట్రోలైట్స్‌ని తిరిగి చేర్చుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి మంచి డిటాక్స్ డ్రింక్‌లా పని చేస్తుంది. కాబట్టి దీన్ని మీ డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.

చర్మ ఆరోగ్యం:

క్రాన్బెర్రీ జ్యూస్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ల వల్ల చర్మ టోన్ అనేది మెరుగు పడుతుంది. నేచురల్‌గా ముఖంలో గ్లో వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..