- Telugu News Photo Gallery Are you spending too much time alone? But psychologists says that it affects the brain in many ways
Health Tips: ఒంటరిగా గడుపుతున్నారా.? శరీరంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే..
కొంతమందికి బయటికి వెళ్లడం ఇష్టం ఉండదు. మరి కొంత మందికి చీకట్లోనే టైం స్పెండ్ చేయడం ఇష్టపడతారు. కొంతమంది ఒంటరిగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఇలాంటి అలవాట్లు, ప్రవర్తనల వల్ల మెదడుపై చెడు ప్రభావం పడుతుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ విషయాన్ని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెదడుకు ఇబ్బంది కలిగించే ఇలాంటి 11 అలవాట్లు మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఒంటరిగా గడపడం,హెడ్ ఫోన్స్‌తో ఎక్కువ సమయం గడపడం,ఎప్పుడు ఇంట్లో ఉండడం, చీకట్లో ఉండడం మంచిది కాదంటున్నారు.
Updated on: Jun 06, 2024 | 1:50 PM

కొంతమందికి బయటికి వెళ్లడం ఇష్టం ఉండదు. మరి కొంత మందికి చీకట్లోనే టైం స్పెండ్ చేయడం ఇష్టపడతారు. కొంతమంది ఒంటరిగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఇలాంటి అలవాట్లు, ప్రవర్తనల వల్ల మెదడుపై చెడు ప్రభావం పడుతుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

ఈ విషయాన్ని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెదడుకు ఇబ్బంది కలిగించే ఇలాంటి 11 అలవాట్లు మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఒంటరిగా గడపడం,హెడ్ ఫోన్స్‌తో ఎక్కువ సమయం గడపడం,ఎప్పుడు ఇంట్లో ఉండడం, చీకట్లో ఉండడం మంచిది కాదంటున్నారు.

అలాగే నిద్ర సరిగ్గా లేకపోవడం, స్క్రీన్ వాడకం ఎక్కువగా ఉండడం లాంటివి ఎక్కువ మెదడుకు ప్రమాదాన్ని కలిగిస్తాయని అంటున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్, యు ఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ వంటి సంస్థల నివేదికలు చెబుతున్నాయి.

పక్కవారితో మాట్లాడడం, చాటింగ్ వంటివి మన మెదడు ఆరోగ్యంగా ఉండటానికి చాలా కీలకం అని సర్వే రిపోర్ట్లు చెబుతున్నాయి. నిద్రలేకపోతే మెదడుకు ఎంత నష్టం కలుగుతుందో.. ఎప్పుడూ ఒంటరిగా ఉండటం వల్ల కూడా అంతే నష్టం కలుగుతుంది అని పరిశోధకులు అంటున్నారు. స్నేహితులతో,కుటుంబంతో ఉండటం వల్ల మెదడు ఫ్రెష్‌గా ఉంటుంది చెబుతున్నారు.

ఒంటరితనం వల్ల డిప్రెషన్, యాంగ్సైటి, డిమేన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది అని వివరిస్తున్నారు నిపుణులు. మెదడు ఆరోగ్యం బాగుండాలంటే మీ స్నేహితులు కుటుంబంతో తరచూ తగినంత సమయాన్ని గడపండి అని సలహా ఇస్తున్నారు.




