Health Tips: మిమ్మల్ని తరచూ తలనొప్పి వేదిస్తోందా.? ఈ విటమిన్ లోపమే కారణం..!
నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి ఎక్కువ నీరు తాగాలి. డీహైడ్రేషన్ మీ ఏకాగ్రతను ప్రభావితం చేస్తుంది. అసౌకర్యాన్ని పెంచుతుంది. మీ తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. మీకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటే, ముందుజాగ్రత్తగా మీ శరీరం ఎల్లప్పుడూ హైడ్రేషన్‌లో ఉండేలా చూసుకోండి. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. హైడ్రేటెడ్ ఫుడ్స్ రెగ్యులర్ గా తినండి.
తలనొప్పి అనేది నేడు చాలా మందిని ప్రభావితం చేసే ఒక వ్యాధిగా మారింది. పిల్లలు, యువకులు, వృద్ధుల వరకు తలనొప్పి తీవ్రంగా వేధిస్తోంది. కొందరికి తరచూగా వస్తే.. మరికొందరిలో అప్పుడప్పుడు తలనొప్పి ఎటాక్ చేస్తుంది. అయితే, తలనొప్పిని నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, ముందుగా మనమందరం దాని కారణం గురించి తెలుసుకోవటం ముఖ్యం. ఎందుకంటే.. శరీరంలోని కొన్ని పోషకాలు, విటమిన్ల లోపం తలనొప్పికి ప్రధాన కారణాలలో ఒకటి అని మీకు తెలుసా? శరీరానికి కావల్సిన పోషకాలు అందేలా చూసుకోవడం ద్వారా తలనొప్పిని కొంత వరకు నివారించవచ్చు. తలనొప్పికి కారణమైన విటమిన్లు, నివారణ మార్గాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…
విటమిన్ డి లోపం: విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. విటమిన్ డి స్థాయిలు తగ్గినపుడు అది తలనొప్పికి కారణమవుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. సూర్యరశ్మి విటమిన్ డి ఉత్తమ మూలం. మీ చర్మం సూర్యరశ్మికి గురైనప్పుడు మీ శరీరంలోని కొలెస్ట్రాల్ విటమిన్ డిగా మారుతుంది. సూర్యుని UVB ప్రోటాన్లు చర్మ కణాలలోని కొలెస్ట్రాల్ నుండి ప్రతిబింబిస్తాయి. ఇవి విటమిన్ డి సంశ్లేషణకు అవసరమైన శక్తిని అందిస్తాయి. విటమిన్ డి తలనొప్పిని నివారించడానికి, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం. పగటిపూట కాసేపు ఎండలో ఉండడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ప్రకారం, 19-70 ఏళ్ల వయస్సు వారికి 600 IU విటమిన్ డి అవసరం. 71 ఏళ్లు పైబడిన వ్యక్తికి 800 IU విటమిన్ డి అవసరం. సూర్యకాంతి కాకుండా, మీరు చేపలు, పాల ఉత్పత్తులు, నారింజ, బీన్స్, విటమిన్ డి సప్లిమెంట్లను తినవచ్చు.
మెగ్నీషియం లోపం: శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉండటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఇది శరీరంలోని నరాలు, కండరాల పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు స్థాయిలను నిర్వహిస్తుంది. మెగ్నీషియం లోపం లక్షణాలు అలసట, తలనొప్పి, ఆకలి లేకపోవడం, వికారం, కండరాల తిమ్మిరి, జలదరింపుతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ శరీరంలో మెగ్నీషియం స్థాయిలను నిర్వహించడానికి మీ డాక్టర్ సలహా మేరకు మెగ్నీషియం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. ఆకుకూరలు, పాలకూర, పాలు, పెరుగు శరీరంలోని మెగ్నీషియం స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. వీటిని వీలైనంత వరకు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.
డీహైడ్రేషన్: అదనంగా డీహైడ్రేషన్ తలనొప్పికి కారణమవుతుంది. నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి ఎక్కువ నీరు తాగాలి. డీహైడ్రేషన్ మీ ఏకాగ్రతను ప్రభావితం చేస్తుంది. అసౌకర్యాన్ని పెంచుతుంది. మీ తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. మీకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటే, ముందుజాగ్రత్తగా మీ శరీరం ఎల్లప్పుడూ హైడ్రేషన్‌లో ఉండేలా చూసుకోండి. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. హైడ్రేటెడ్ ఫుడ్స్ రెగ్యులర్ గా తినండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..