మిరపకాయలు కోసిన తర్వాత చేతులు మండిపోతున్నాయా..? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరి..
చాలా మంది వ్యక్తులు ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అందుకు పరిష్కారంగా తమ చేతులను నీటితో కడుక్కోవడం లేదంటే, మంటగా అనిపించినప్పుడు చాలా సేపు చేతులను నీటిలోనే ఉంచుతారు. కానీ ఇది కూడా మంటను తగ్గించదు. అసలు మిరపకాయ కోసినప్పుడు చేతులు ఎందుకు మండుతాయి.? ఆ మంటను తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిరపకాయ ఆహారాన్ని స్పైసీగా మార్చడమే కాకుండా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. పచ్చి మిరపకాయల్లో విటమిన్ సితో పాటు మన ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పచ్చి మిరపకాయలను కోసిన ప్రతిసారీ మన చేతులు చాలా మంటగా వుంటాయి. అదే చేతులతో మనం ముక్కు, మూతి ఎక్కడ తాకినా కూడా విపరీతమైన మంటపుడుతుంది. అయితే, కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే ఆ మంట నుండి క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది. అలాంటి చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…
మిరపకాయలు కోసిన తర్వాత చేతులు కాలిపోతున్నంతలా మంట పుడుతుంది. ఇది చాలా సాధారణం. చాలా మంది వ్యక్తులు ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అందుకు పరిష్కారంగా తమ చేతులను నీటితో కడుక్కోవడం లేదంటే, మంటగా అనిపించినప్పుడు చాలా సేపు చేతులను నీటిలోనే ఉంచుతారు. కానీ ఇది కూడా మంటను తగ్గించదు. అసలు మిరపకాయ కోసినప్పుడు చేతులు ఎందుకు మండుతాయి.? ఆ మంటను తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది కొన్ని మిరపకాయలలో ఎక్కువ, మరికొన్నింటిలో తక్కువగా ఉంటుంది. కానీ, మీరు క్యాప్సైసిన్ అధికంగా ఉండే మిరపకాయను కోసినప్పుడు చేతులు మంటపుడుతుంటాయి. ఇది ప్రమాదకరమైన సమస్య కాదు. కొన్ని గంటల్లో దానంతటదే తగ్గిపోతుంది. కానీ, ఆ కొన్ని గంటలు మంట ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరి..
పెరుగు, నెయ్యి లేదా పాలు ఉపయోగించండి
మిరపకాయలు కోసిన తర్వాత చల్లటి పాలు, నెయ్యి, వెన్న లేదా పెరుగు కలిపి చేతులకు రాసుకుంటే చేతుల మంట తగ్గుతుంది. అయితే మీరు మీ చేతులకు ఏది అప్లై చేసినా కనీసం రెండు నిమిషాల పాటు అలాగే ఉంచండి. అప్పుడే మంట తగ్గుతుంది.
అలోవెరా జెల్ ..
చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కలబంద గుజ్జు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలోవెరా జెల్ అప్లై చేయటం వల్ల మిరపకాయలను కత్తిరించిన తర్వాత వచ్చే మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం, అలోవెరా జెల్ తీసుకొని మీ చేతులకు క్రీమ్ లాగా అప్లై చేయండి. లేదంటే, జెల్తో మీ చేతులకు మసాజ్ చేయండి. ఇది మంటను తక్షణమే తగ్గిస్తుంది.
తేనె..
చిన్న చిన్న గాయాలను నయం చేయడంలో, మంట, చికాకును తగ్గించడంలో తేనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మిరపకాయలను కోసిన తర్వాత చేతులకు తేనె రాసుకుంటే మంట వెంటనే తగ్గుతుంది. కానీ, తేనెను చేతులకు పూయకూడదు. కాబట్టి మీరు కొద్దిగా నిమ్మరసంతో కలిపి అప్లై చేసుకోవటం మంచిది.
ఐస్ క్యూబ్స్ ..
ఐస్ క్యూబ్స్ చేతుల్లో మంటను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. దీని కోసం మిరపకాయలను కోసిన తర్వాత ముందుగా మీ చేతిలో ఐస్ క్యూబ్ పట్టుకోండి. అదే ఐస్‌తో మీరు మీ చేతులను మసాజ్ చేసుకోవచ్చు. చల్లటి నీటిలో చేతులు ముంచడం వల్ల కూడా మంట నుండి ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..