AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facts about Apple: యాపిల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?

యాపిల్ పండు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరికీ అన్నీ తెలుసు. యాపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. రోజుకో యాపిల్ తింటే ఎన్నో రోగాలను దూరం చేసుకోవచ్చు. ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే.. ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి టీకా వేసుకున్నట్లే. రోజుకో యాపిల్ తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు అయిన..

Facts about Apple: యాపిల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
Apple
Chinni Enni
|

Updated on: May 30, 2024 | 5:22 PM

Share

యాపిల్ పండు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరికీ అన్నీ తెలుసు. యాపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. రోజుకో యాపిల్ తింటే ఎన్నో రోగాలను దూరం చేసుకోవచ్చు. ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే.. ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి టీకా వేసుకున్నట్లే. రోజుకో యాపిల్ తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు అయిన బీపీ, షుగర్, క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యాపిల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో కీలకంగా పని చేస్తుంది. యాపిల్‌లో విటమిన్లు ఏ, బి, సి, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్ వంటివి లభిస్తాయి. యాపిల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ:

యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల చర్మ సమస్యలు అన్నీ తగ్గుతాయి. నిద్రలేమి, కీళ్ల నొప్పులు, తలనొప్పి, ఊబకాయం, ఆస్తమా, అనీమియా, నాడీ సమస్యలు, జలుబు వంటి అనేక సమస్యలు వస్తాయి.

చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

యాపిల్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. శరీర బరువును తగ్గించడంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో యాపిల్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి రోజూ యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.

ఇవి కూడా చదవండి

యంగ్‌గా ఉండొచ్చు:

యాపిల్ తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. చర్మాన్ని యంగ్‌గా ఉంచడంలో యాపిల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలోని మలిన పదార్థాలను, ట్యాక్సిన్స్‌ను, వ్యర్థాలను తొలగిస్తుంది. దీంతో చర్మం యంగ్‌గా ఉంచుతుంది.

మెదడు చురుగ్గా ఉంటుంది:

యాపిల్ తినడం వల్ల మెదడు యాక్టీవ్‌గా అవుతుంది. దీంతో మతి మరుపు దూరమవుతుంది. అల్జీమర్స్ వంటివి దరి చేరకుండా ఉంటాయి. యాపిల్ తినడం వల్ల రక్త హీనత సమస్య కూడా దూరమవుతుంది. రక్త హీనత సమస్య ఉండేవారు యాపిల్ తింటే చాలా మంచిది.

గుండె జబ్బులు రావు:

గుండె జబ్బులు ఉన్నవారు యాపిల్ తింటే.. గుండె పనితీరు అనేది మెరుగుపడుతుంది. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్త పోటును పెరగకుండా చూస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్