Health: వామ్మో.. ఖాళీ కడుపుతో వీటిని తింటున్నారా..? పెను ప్రమాదంలో పడినట్లే.. బీకేర్‌ఫుల్..
ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి తినడం చాలాముఖ్యం.. అయితే.. ఉదయాన్నే అల్పాహారం రోజులో ముఖ్యమైన భోజనంగా పరిగణిస్తారు. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా రోజంతా మన జీవక్రియను సెట్ చేస్తుంది. అయితే అల్పాహారానికి ముందు కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి తినడం చాలాముఖ్యం.. అయితే.. ఉదయాన్నే అల్పాహారం రోజులో ముఖ్యమైన భోజనంగా పరిగణిస్తారు. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా రోజంతా మన జీవక్రియను సెట్ చేస్తుంది. అయితే అల్పాహారానికి ముందు కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ, కాపీతోపాటు.. అల్పాహారానికి ముందు.. అంటే ఖాళీ కడుపుతో మనం ఏమి తినకూడదు..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
వాస్తవానికి తరచుగా, ఉదయం నిద్రలేచిన తర్వాత, ఖాళీ కడుపుతో తినకూడని కొన్ని పదార్థాలు తింటాము. దీనివల్ల పలు సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. అందుకే.. అల్పాహారంలో అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి.. దాంతోపాటు అల్పాహారానికి ముందు కొన్ని ఆహారాలను తినకూడదు.. అవేంటో చూద్దాం..
ఖాళీ కడుపుతో వీటిని తినకండి..
సిట్రస్ పంట్లు – జ్యూస్: నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను.. వాటి రసాన్ని ఖాళీ కడుపుతో తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ పండ్లలో అధిక ఆమ్లాలు ఉంటాయి. ఇవి కడుపులో ఆమ్లతను పెంచుతాయి. దీని వల్ల కడుపులో మంట, అల్సర్ వంటి సమస్యలు వస్తాయి.
అరటిపండు: అరటిపండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పొటాషియం, మెగ్నీషియం స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీని కారణంగా, గుండె కొట్టుకోవడం సక్రమంగా మారవచ్చు.. దీంతోపాటు కడుపులో ఆమ్లత్వం కూడా పెరుగుతుంది.
శీతల పానీయాలు: శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, చల్లని నీరు కూడా ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. ఇది మీ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది.
టీ-కాఫీ: చాలా మంది రోజుని కాఫీ లేదా టీతో ప్రారంభిస్తారు. అయితే ఖాళీ కడుపుతో కెఫీన్ తీసుకోవడం వల్ల పొట్టలో ఎసిడిటీ పెరిగి గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి. బదులుగా, ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం మంచిది.
బన్స్- స్వీట్లు: రుచికరమైన బన్స్, రొట్టెలు, ఇతర స్వీట్లు ఖాళీ కడుపుతో తినకూడదు. ఇవి అధిక మొత్తంలో చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది శక్తిలో అకస్మాత్తుగా పెరుగుదల, క్షీణతకు కారణమవుతుంది.. ఇది మిమ్మల్ని త్వరగా అలసిపోయేలా చేస్తుంది.
పెరుగు: పెరుగు పౌష్టికాహారం, కానీ ఖాళీ కడుపుతో తినకూడదు. ఇలా చేయడం వల్ల కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను నాశనం చేస్తుంది.. ఇంకా కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




