Sleep Exercises: మీకు తెలుసా? పడుకుని కూడా ఈ ఎక్సర్ సైజులు చేయవచ్చు..
ఆరోగ్యంగా, దృఢంగా, ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామాలు చేయాలి. ప్రతి రోజూ ఎక్సర్‌సైజుల చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి రోజూ వ్యాయామం చేయడం చాలా మంచిది. ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. గుండె జబ్బులు, బీపీ, షుగర్, అధిక బరువు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే వ్యాయామం మితంగా మాత్రమే చేయాలి. మరింత ఎక్కువగా చేస్తే.. ప్రాణానికే ప్రమాదం. ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది..

ఆరోగ్యంగా, దృఢంగా, ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామాలు చేయాలి. ప్రతి రోజూ ఎక్సర్‌సైజుల చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి రోజూ వ్యాయామం చేయడం చాలా మంచిది. ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. గుండె జబ్బులు, బీపీ, షుగర్, అధిక బరువు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే వ్యాయామం మితంగా మాత్రమే చేయాలి. మరింత ఎక్కువగా చేస్తే.. ప్రాణానికే ప్రమాదం. ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వ్యాయామం చేస్తే చాలా సులభంగా బయట పడొచ్చు.
ఆహారపు అలవాట్లును మార్చుకుంటూ రోజూ వ్యాయామం చేస్తే.. ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. అయితే చాలా మందికి వ్యాయామం చేసే సమయం కూడా ఉండదు. ఇంకొంత మంది వ్యాయమం చేయడానికి కూడా బద్దకిస్తూ ఉంటారు. ఇలా బద్దకించే వారు కూడా పడుకుని సులభంగా వ్యాయామం చేయవచ్చు. దీని వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. బెడ్‌పై పడుకుని చేయవచ్చు. దీని వల్ల సన్ననైన నాజూకు నడుము మీ సొంతం అవుతుంది. బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. మరి ఆ వ్యాయామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పార్శ్వ కాలు లిఫ్ట్ వ్యాయామం:
ఈ వ్యాయామం చేయడానికి ముందుగా ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎడమ కాలు పాదాన్ని నేలపై ఉంచాలి. ఆ తర్వాత ఎడమ చేతిపై బరువు వేసి శరీరాన్ని పైకి లేపాలి. ఇప్పుడు కుడి కాలును పైకి కిందికి కదుపుతూ ఉండాలి. ఇలా 20 నుంచి 30 సార్లు చేయాలి. ఇలానే కుడి వైపు కూడా చేయాలి.

హ్యాపీ బేబీ ఎక్సర్ సైజ్:
ఈ వ్యాయామం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. చిన్న పిల్లలు బెడ్‌పై పడుకుని కాళ్లను పైకి ఎత్తి పాదాలను చేతితో పట్టుకోవాలి. వీపు భాగాన్ని పైకి లేపి.. తలపై ఉంచి కాళ్లను పైకి లేపాలి. చేతితో కాళ్లను పట్టుకోవాలి. రెండు పాదాలు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ఇలా వీలైనంత సేపు భంగిమలో ఉండాలి. ఇలా మీరు బెడ్‌పైనే చేయవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..