నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? అయితే, తినే ఆహారంపై శ్రద్ధపెట్టండి..
నిద్రలేమి కారణంగా మధుమేహం, రక్తపోటు, ఒత్తిడి వంటి దీర్ఘకాలిక సమస్యలకు కూడా దారితీ తీస్తుంది. అంతేకాదు సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల మానసిక స్థితి, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. కొందరు రాత్రి ఒంటిగంట దాటినా నిద్రపోరు.
కొన్ని ఆహార మార్పులు చేయడం ద్వారా మంచి నిద్రను పొందుతారని ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి నిద్రకు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉందంటున్నారు.. మీరు మంచి నిద్రను పొందేందుకు ఇక్కడ కొన్ని ఆహార చిట్కాలు ఉన్నాయి.
ఆల్కహాల్ మీకు మొదట్లో నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది. కానీ, అది రాత్రిపూట మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. క్రమ క్రమంగా ఆరోగ్యాన్ని కూడా క్షిణింపజేస్తుంది. అందువల్ల మద్యపానాన్ని పరిమితంగా తీసుకోవటం లేదంటే, పూర్తిగా నివారించడం మంచిది.
కెఫిన్ మీ నిద్రను మరింత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఎక్కువ కెఫిన్ నిద్రకు భంగం కలిగిస్తుంది. రాత్రిపూట కాఫీ, టీ, శీతల పానీయాలు వంటి కెఫిన్ పానీయాలకు దూరంగా ఉండండి.
రోజులో తగినంత నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇది నిర్జలీకరణంతో సంబంధం ఉన్న నిద్ర ఆటంకాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
పడుకునే ముందు వలేరియన్ రూట్ టీ వంటి హెర్బల్ టీలు తాగడం వల్ల మీరు విశ్రాంతి పొందవచ్చు. ఇది మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
పడుకునే ముందు ఆహారం ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. దానివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది. నిద్రించడానికి కొన్ని గంటల ముందు తేలికపాటి భోజనం చేయడం మంచిది.
స్పైసీ, ఆమ్ల ఆహారాలు అజీర్ణం లేదా గుండెల్లో మంటను కలిగిస్తాయి. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..