AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Distress: మధుమేహ రోగుల్లో పెరుగుతున్న మానసిక సమస్యలు.. కారణం ఇదేనంటున్న నిపుణులు

మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నట్ల తాజా అధ్యయనాలు వెల్లడించాయి. గతంతో పోల్చితే నేటి కాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు..

Diabetes Distress: మధుమేహ రోగుల్లో పెరుగుతున్న మానసిక సమస్యలు.. కారణం ఇదేనంటున్న నిపుణులు
Diabetes Distress
Srilakshmi C
|

Updated on: Nov 19, 2024 | 9:13 PM

Share

నేటి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సవాల్‌గా మారింది. భారత్‌లో కూడా మధుమేహం పెరుగుతోంది. డయాబెటిస్‌ రోగుల సంఖ్య 100 మిలియన్లు దాటింది. ఈ వ్యాధి శారీరకంగా, మానసికంగా శరీరాన్ని దెబ్బతీస్తుంది. శరీరంపై మధుమేహం ప్రభావం గురించి మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. టైప్-1, టైప్-2 మధుమేహం ఉన్న రోగులలో డిప్రెషన్ ప్రమాదం సాధారణ జనాభా కంటే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఈ రోగులు ఆందోళన చెందడానికి 20% ఎక్కువ అవకాశం ఉందని అధ్యయనంలో వెల్లడైంది. మధుమేహం మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

డయాబెటిస్ ఉన్న రోగులలో కొన్ని రకాల హార్మోన్లు హెచ్చుతగ్గులకు గురవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయి. మధుమేహం వచ్చాక ఇతర వ్యాధులు వస్తాయని భయపడేవారు కొందరున్నారు. ఈ భయం మీ ఆందోళనను పెంచుతుంది. ఇలాగే ఎక్కువ కాలం ఆందోళనగా ఉంటే అది డిప్రెషన్‌కు దారి తీస్తుంది. ది లాన్సెట్ అధ్యయనం ప్రకారం.. రక్తంలో అధిక చక్కెర మెదడు, ఊపిరితిత్తులు, గుండెతో సహా శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. మెదడుపై దీని ప్రభావం పెరిగినప్పుడు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.

మధుమేహం మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

ఢిల్లీకి చెందిన GTB హాస్పిటల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్లో పనిచేస్తున్న డాక్టర్ అజిత్ కుమార్ మాట్లాడుతూ.. అధిక షుగర్ లెవెల్స్ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చెప్పారు. ఇది ఎక్కువ కాలం పెరిగితే మెదడు సమతుల్యత దెబ్బతిని మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. మధుమేహంలో ఆక్సీకరణ ఒత్తిడి స్థాయిలు కూడా పెరుగుతాయి. ఇది ఆందోళన, నిరాశను కూడా కలిగిస్తుందని డా. అజిత్ కుమార్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం 2022లో భారతదేశంలో అత్యధిక సంఖ్యలో మధుమేహ రోగులు పెరిగినట్లు పేర్కొంది. ఇది ప్రపంచంలోని 828 మిలియన్ కేసులలో నాలుగింట ఒక వంతు.

ఇవి కూడా చదవండి

మధుమేహాన్ని ఎలా నివారించాలి?

  • ప్రతిరోజూ వ్యాయామం చేయాలి
  • ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి
  • ఒత్తిడికి గురికావద్దు
  • స్వీట్స్‌ ఎక్కువగా తినవద్దు
  • స్థూలకాయాన్ని అదుపులో ఉంచుకోవాలి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నోరూరించే టర్కీ కోడి కూర ఇలా చేస్తే.. గిన్నె కూడా వదలరు
నోరూరించే టర్కీ కోడి కూర ఇలా చేస్తే.. గిన్నె కూడా వదలరు
క్యాన్సర్–అనీమియా.. నాలుక ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయొద్దు
క్యాన్సర్–అనీమియా.. నాలుక ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయొద్దు
బండిమీద టేస్ట్ వచ్చే చికెన్ పకోడీ ఇలా చేస్తే.. రుచి అదిరిపోతోంది
బండిమీద టేస్ట్ వచ్చే చికెన్ పకోడీ ఇలా చేస్తే.. రుచి అదిరిపోతోంది
జిమ్ వర్కౌట్స్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ ఆమ్లెట్
జిమ్ వర్కౌట్స్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ ఆమ్లెట్
పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ విల్లా కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ విల్లా కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
పొడి చర్మం ఉన్నవారికి వరప్రసాదం.. ఆలివ్ ఆయిల్
పొడి చర్మం ఉన్నవారికి వరప్రసాదం.. ఆలివ్ ఆయిల్
స్టేజ్ భయం పోవాలన్నా, ఇంటర్వ్యూల్లో నెగ్గాలన్నా..
స్టేజ్ భయం పోవాలన్నా, ఇంటర్వ్యూల్లో నెగ్గాలన్నా..
అట్టహాసంగా అల్లు శిరీష్, నయనికల వివాహం.. వీడియో ఇదిగో
అట్టహాసంగా అల్లు శిరీష్, నయనికల వివాహం.. వీడియో ఇదిగో
‘ఆల్పైన్ విడాకులు’..మృత్యువు ఒడిలోకి భాగస్వామి ట్రెండా..?
‘ఆల్పైన్ విడాకులు’..మృత్యువు ఒడిలోకి భాగస్వామి ట్రెండా..?
త​‍క్కువ ధరకు పెట్రోల్‌ కావాలా? ఇలా చేయండి..
త​‍క్కువ ధరకు పెట్రోల్‌ కావాలా? ఇలా చేయండి..