Boda Kakara: ఈ సీజనల్ వెజిటేబుల్ బోడ కాకర తింటే.. షుగర్ మాయం!

మనం నిత్యం ఆహారంగా తీసుకునే వాటిల్లో కూరగాయలు కూడా ఒకటి. కూరగాయల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో ఇష్టమైనవి తప్పించి.. వేరే వాటి వంక కన్నెత్తి కూడా చూడరు. ఇలా వీటిల్లో బోడ కాకరకాయ కూడా ఒకటి. దీన్నే కకోరా, కంటోల, కకోడ అని, ఇంకొందరు ఆ కాకరకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా ఈ కూరగాయకి చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఈ కూరగాయ ఇతర వాటిలా అన్ని కాలాల్లో దొరకదు. కేవలం ఈ సీజన్‌లో మాత్రమే..

Boda Kakara: ఈ సీజనల్ వెజిటేబుల్ బోడ కాకర తింటే.. షుగర్ మాయం!
Boda Kakara
Follow us

|

Updated on: Jul 01, 2024 | 3:22 PM

మనం నిత్యం ఆహారంగా తీసుకునే వాటిల్లో కూరగాయలు కూడా ఒకటి. కూరగాయల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో ఇష్టమైనవి తప్పించి.. వేరే వాటి వంక కన్నెత్తి కూడా చూడరు. ఇలా వీటిల్లో బోడ కాకరకాయ కూడా ఒకటి. దీన్నే కకోరా, కంటోల, కకోడ అని, ఇంకొందరు ఆ కాకరకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా ఈ కూరగాయకి చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఈ కూరగాయ ఇతర వాటిలా అన్ని కాలాల్లో దొరకదు. కేవలం ఈ సీజన్‌లో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఈ కూరగాయలో పోషకాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఈ కూరగాయ తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చని చాలా మందికి తెలీదు. వీటిని తినడానికే కాదు.. ఔషధాలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈ బోడ కాకరకాయ తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బోడ కాకరలో పోషకాలు:

బోడ కాకరకాయలో చాలా రకాల పోషకాలు మనకు అందుతాయి. ప్రోటీన్, ఫైబర్,జింక్, కాపర్, విటమిన్లు ఎ, సి, కె, బి1,బి2, బి3, బి5, బి6, డి వంటివి ఎక్కువగా లభిస్తాయి.

షుగర్ కంట్రోల్:

డయాబెటీస్ ఉన్నవారు బోడ కాకరకాయ తినడం వల్ల.. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఎలాంటి సందేహం లేకుండా ఈ కూరగాయ తీసుకోవచ్చు. షుగర్ కంట్రోల్ అవ్వాలి అనుకునేవారు బోడ కాకర కాయ తినవచ్చు.

ఇవి కూడా చదవండి

బీపీ నియంత్రణ:

బోడ కాకర కాయ తింటే రక్త పోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. ఇప్పుడు చాలా మంది బీపీ సమస్యతో బాధ పడుతున్నారు. బీపీ కంట్రోల్ అవ్వాలంటే ఈ కూరగాయ తీసుకోవచ్చు.

వెయిట్ లాస్:

ఈ ప్రస్తుత కాలంలో అధిక బరువు అనేది ఒక సమస్యగా మారిపోయింది. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు ఈ కూరగాయను మీ డైట్‌లో చేర్చుకోండి. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్లు.. బరువు తగ్గించేందుకు సహాయ పడతాయి. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

జీర్ణ ఆరోగ్యం:

బోడ కాకరకాయ తినడం వల్ల జీర్ణ ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. ఈ కూరగాయ తినడం వల్ల ప్రేగుల్లో, కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియా బయటకు పోతుంది. అంతే కాకుండా గ్యాస్, అజీర్తి, మల బద్ధకం వంటి సమస్యలు కంట్రోల్ అవుతాయి. పొట్టలో ఇన్ ఫెక్షన్ తగ్గుతుంది.

శ్వాసకోశ సమస్యలు:

శ్వాస కోశ సమస్యలతో బాధ పడేవారు సైతం బోడ కాకర తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటివి కంట్రోల్ అవుతాయి. అంతే కాకుండా వాత, పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..