Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulsi Seeds: తులసి గింజలతో డయాబెటీస్‌కు చెక్.. ఎలా ఉపయోగించాలంటే..

తులసి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మొక్క గురించి దాదాపు అందరికీ తెలుసు. ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉంటాయి. ప్రతీ ఒక్కరి ఇంట్లో తులసి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎన్నో వ్యాధులు దరి చేరకుండా చేయడంలో తులసి మొక్క ఎంతో చక్కగా పని చేస్తుంది. ఆయుర్వేద పరంగా కూడా ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ప్రతి రోజూ ఓ తులసి ఆకు నమిలినా ఎన్నో రోగాలు..

Tulsi Seeds: తులసి గింజలతో డయాబెటీస్‌కు చెక్.. ఎలా ఉపయోగించాలంటే..
ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో మనం తులసి మొక్క నుంచి సేకరించిన గింజలను చల్లినట్లయితే ఎన్నో తులసి మొక్కలు పెరిగి క్రమేణా తులసి వనం ఏర్పడుతుంది.ఈ తులసి వనం మీద నుంచి వచ్చే గాలి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తలనొప్పి, గొంతు నొప్పి జలుబుతో బాధపడే వారు తులసి ఆకులు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.
Follow us
Chinni Enni

|

Updated on: Sep 14, 2024 | 12:05 PM

తులసి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మొక్క గురించి దాదాపు అందరికీ తెలుసు. ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉంటాయి. ప్రతీ ఒక్కరి ఇంట్లో తులసి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎన్నో వ్యాధులు దరి చేరకుండా చేయడంలో తులసి మొక్క ఎంతో చక్కగా పని చేస్తుంది. ఆయుర్వేద పరంగా కూడా ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ప్రతి రోజూ ఓ తులసి ఆకు నమిలినా ఎన్నో రోగాలు రాకుండా చూసుకోవచ్చు. తులసి ఆకుల మాదిరి గానే.. తులసి విత్తనాల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

తులసి విత్తనాల్లో కూడా మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచతాయి. మరి ఈ విత్తనాలు తీసుకోవడం ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

వెయిట్ లాస్:

తులసి గింజలు తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గించవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ప్రతి రోజూ కొన్ని తులసి విత్తనాలను నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగాలి. ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీవక్రియను పెంచి.. కొవ్వును కరిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తి:

తులసి విత్తనాల్లో అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బలపడుతుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఇవి ఎంతో చక్కగా ఉపయోగ పడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది.

జీర్ణ సమస్యలు పరార్:

ప్రతి రోజూ ఉదయం తులసి విత్తనాలు మరిగించిన నీటిని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఎంతో చక్కగా పనిచేస్తుంది. గ్యాస్, అసిడిటీ, మల బద్ధకం సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. ఇందులో తేనె కూడా కలుపుకుని తాగవచ్చు. పేగుల ఆరోగ్యం కూడా పెరుగుతుంది.

డయాబెటీస్ కంట్రోల్:

తులసి విత్తనాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అనేవి కంట్రోల్ అవుతాయి. రక్తంలోని చక్కెర స్థాయులను కంట్రోల్ చేయడంలో తులసి విత్తనాలు చక్కగా సహాయ పడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..