Date Seeds: ఖర్జూరం తిని గింజలు పడేస్తున్నారా.. కాఫీ నుంచి స్క్రబ్ వరకూ ఎన్ని ఉపయోగాలో తెలుసా

ఖర్జూరం తినే వారు దానిలోని గింజలను పారేస్తారు. అయితే ఖర్జూరం గింజలతో కాఫీ నుంచి స్క్రబ్ వరకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని అని మీకు తెలుసా. ఒక విధంగా ఖర్జూరం గింజలు విసిరేయడానికి బదులుగా వాటిని మళ్లీ ఉపయోగించుకోవచ్చు. అందుకు సంబంధించిన సింపుల్ చిట్కాలను ఈ రోజు తెలుసుకుందాం..

Date Seeds: ఖర్జూరం తిని గింజలు పడేస్తున్నారా.. కాఫీ నుంచి స్క్రబ్ వరకూ ఎన్ని ఉపయోగాలో తెలుసా
Dates Palm SeedsImage Credit source: social media
Follow us
Surya Kala

|

Updated on: Sep 23, 2024 | 8:46 PM

ఖర్జూరం రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఒక వరం. అయితే ఖర్జూరాలు చాలా రంగులలో ఉంటాయి. కానీ ఎక్కువగా ఎరుపు, పసుపు, గోధుమ రంగులు ఖర్జూరాలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ఖర్జూరాలు పోషకాల నిల్వల గని. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇవి రోన రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. ఖర్జూరాల్లో అధికంగా ఫైబర్ తో పటు ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్నందున వీటిని తినడం వలన మెదడుకు ప్రయోజనం చేకూరుతుంది. ఎవరికైనా షుగర్ ఉంటే.. వీటిని పరిమితంగా తినవచ్చు. ఇవి సహజమైన తీపి పదార్ధాలను కలిగి ఉన్నాయి. కనుక ఎవరికైనా తీపి తినాలని పిస్తే ఖర్జురాలను తినొచ్చు.

ఖర్జూరం తినే వారు దానిలోని గింజలను పారేస్తారు. అయితే ఖర్జూరం గింజలతో కాఫీ నుంచి స్క్రబ్ వరకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని అని మీకు తెలుసా. ఒక విధంగా ఖర్జూరం గింజలు విసిరేయడానికి బదులుగా వాటిని మళ్లీ ఉపయోగించుకోవచ్చు. అందుకు సంబంధించిన సింపుల్ చిట్కాలను ఈ రోజు తెలుసుకుందాం..

ఖర్జూర విత్తనాలను ఎలా ఉపయోగించాలంటే

ఖర్జూరం గింజల ఫేస్ ప్యాక్

ఇవి కూడా చదవండి

కావాలంటే ఖర్జూరం గింజలతో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. ఇందుకోసం ఖర్జూర విత్తనాలను కడిగిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి. ఇప్పుడు వాటిని గ్రైండ్ చేసి ముల్తానీ మిట్టిలో కలపాలి. తర్వాత ఈ మిశ్రమంలో నీళ్లతో పాటు కొంచెం రోజ్ వాటర్, తేనె వేసి కలపండి. ఇప్పుడు ఖర్జూర విత్తనాల ఫేస్ ప్యాక్ సిద్ధంగా ఉంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఒక 20 నిముషాలు ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మెరిసే ముఖం మీ సొంతం.. అంతేకాదు ఇతర చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

డేట్స్ సీడ్ బాడీ స్క్రబ్ ఖర్జూరం గింజల ఫేస్ ప్యాక్ మాత్రమే కాదు డేట్ సీడ్ స్క్రబ్‌ను సిద్ధం చేసుకోవచ్చు. దీని కోసం కూడా కడిగిన విత్తనాలను ఎండబెట్టి దాని పొడిని సిద్ధం చేయండి. ఈ మిశ్రమానికి కాఫీ పొడి, తేనెను కూడా జోడించండి. ముఖాన్ని వదిలి పెట్టి.. ఇలా రెడీ చేసిన ఖర్జూరం గింజల స్క్రబ్‌తో శరీరంలోని ఇతర భాగాలను స్క్రబ్ చేయాలి. ఈ పద్ధతితో చేయడం వలన చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిపోతాయి. చర్మం డీప్ క్లీనింగ్ అయ్యి స్కిన్ మెరుస్తుంది.

బేకింగ్ లో

ఆహారం రుచిని పెంచడానికి కోకో పౌడర్ ఉపయోగిస్తే.. అందుకు బదులుగా ఖర్జూరపు గింజల పొడిని ఉపయోగించవచ్చు. ఇది రుచిని మెరుగుపరుస్తుంది. అయితే దీన్ని అధిక పరిమాణంలో ఎక్కువగా ఉపయోగించవద్దు. ఎక్కువగా ఖర్జూరపు గింజల పొడి కలిపితే ఆహారం చేదు ఉంటుంది. అయితే ఈ మిశ్రమంలో తేనెను కూడా జోడించవచ్చు ఎందుకంటే ఇది ఆహార పదార్థాలకు తీపిని జోడించడమే కాదు ఆహారపు రుచిని పెంచుతుంది.

ఖర్జూరపు గింజల కాఫీ

అరబ్ దేశాల్లో ఖర్జూరం గింజల కాఫీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది కెఫిన్ లేనిది. శక్తిని కూడా ఇస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ముందుగా ఖర్జూర విత్తనాలను పొడిగా వేయించి నీటిలో నానబెట్టి ఎండలో ఆరబెట్టాలి. దీని తరువాత దాల్చిన చెక్క పొడి, ఖర్జూరం సిరప్, యాలకుల పొడి కలపాలి. ఇప్పుడు తయారుచేసిన ఖర్జూరం గింజల పొడిని వేడి పాలలో వేసి కాసేపు మరిగించిన తర్వాత.. ఖర్జూరం కాఫీని ఆస్వాదిస్తూ తాగండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!