Success Story: దక్షిణాది దోసను నమ్ముకున్న ముంబై దంపతులు.. నేడు నెలకు కోటి రూపాయల సంపాదన..
ఈ రోజు విజయాన్ని అందుకుని జీరో స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తిన వ్యక్తులను మీ విషయ రహస్యం ఏమిటి అని అడిగితే ఒక్కటే చెబుతారు. కృషి పట్టుదలతో పని చేయడం అని అంటారు. సక్సెస్ కు షార్ట్ కట్స్ లేవని అంటారు. ఇలాంటి వ్యక్తులు నేటి యువతకు స్పూర్తిగా నిలుస్తారు. జీతాలలో పెరుగుదల లేదని చేస్తున్న ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి.. క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెలకు కోటిన్నరకు పైగా సంపాదిస్తున్న దంపతుల గురించి వారి బిజినెస్ గురించి తెలుసుకుందాం..

ఈ రోజు విజయాన్ని అందుకుని జీరో స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తిన వ్యక్తులను మీ విషయ రహస్యం ఏమిటి అని అడిగితే ఒక్కటే చెబుతారు. కృషి పట్టుదలతో పని చేయడం అని అంటారు. సక్సెస్ కు షార్ట్ కట్స్ లేవని అంటారు. ఇలాంటి వ్యక్తులు నేటి యువతకు స్పూర్తిగా నిలుస్తారు. జీతాలలో పెరుగుదల లేదని చేస్తున్న ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి.. క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెలకు కోటిన్నరకు పైగా సంపాదిస్తున్న దంపతుల గురించి వారి బిజినెస్ గురించి తెలుసుకుందాం..
ముంబైకి చెందిన అఖిల్, శ్రీయ దంపతులు మొదట్లో కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. అయితే ఉద్యోగంలో వచ్చే ఆదాయం వీరికి సంతృప్తినివ్వలేదు. దీంతో ఏదైనా బిజినెస్ చెయలని భావించారు. తమకు వచ్చిన ఆలోచనని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పారు. వారు రకరకాల సలహాలు చెప్పారు. అయితే ఏవీ వీరి ఆలోచనకు కనెక్ట్ కాలేదు. ఇలాంటి సమయంలో అఖిల్, శ్రియలు ఒక నార్త్ ఇండియన్ కేఫ్ కి వెళ్ళారు. అక్కడ బెంగళూరు దోసను ఆర్డర్ చేసి తిన్నారు. అలా తింటున్న సమయంలో వారికి దోసను ముంబై వాసులకు పరిచయం చేస్తే.. బాగుంటుందని భావించారు.
దీంతో హోటల్ ని పెట్టేందుకు తాము ఎంచుకున్న ప్రాంతాల్లో షాప్స్ ని చూశారు. అయితే అవన్నీ వీరి బడ్జెట్ కు అందనంత దూరంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అయినా నిరాశ పడలేదు. తమ తెలివికి పదుని పెట్టారు. పెద్ద హోటల్స్ కి మాత్రమే కాదు ఫుడ్ నచ్చితే స్ట్రీట్ దగ్గరకి అయినా వచ్చి తింటారు అన్న విషయాన్నీ నమ్మి.. తాము నివసిస్తున్న చోట … ఒక చిన్న ప్రాంతాన్ని రెంట్ కి తీసుకుని దానిని క్లౌడ్ కిచెన్ లా మార్చారు. వ్యాపారంలో అడుగు పెట్టారు.
తమ క్లౌడ్ కిచెన్ లో దోసని అది కూడా బెంగళూరులో ఫేమస్ అయిన బెన్ని దోసని అందించాలని భావించారు. ఈ దోస క్రిస్పీగా.. మెత్తగా ఉండి.. తినేవారిని ఆకట్టుకుంటుంది. తమ వ్యాపారాన్ని తామే ప్రమోట్ చేసుకోవాలని భావించారు. ఓపెన్ కిచెన్ లో దోసాల తయారీ విధానాన్ని తినడానికి వచ్చిన వారికి చూపించడమే కాదు.. రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. దోస తయారీ చాలా నాణ్యతతో ఉండడంతో తక్కువ రోజుల్లోనే అందరినీ ఆకట్టుకుంది. చిన్నగా మొదలు పెట్టడంతో ఎక్కువ మంది ఉద్యోగస్తులు అవసరం రాలేదు. అఖిల్, శ్రీయ లతో పాటు కొంత మందిని తీసుకున్నారు. దోస నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తమ దగ్గరికి వచ్చిన వారికీ అందించడం మొదలు పెట్టారు. దీంతో త్వరగానే భారీ ఆర్డర్లు అందుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు తమ బిజినెస్ ని విస్తరించే పనిలో ఉన్నారు. ఈ దంపతులు నెలకు కోటి రూపాయల వరకూ సంపాదిస్తున్నారు. తమకు ఖర్చులన్నీ పోను నెలకు రూ. 70 లక్షలు మిగులుతున్నాయని ఈ దంపతులు సంతోషంగా చెబుతున్నారు.
View this post on Instagram
బెన్నీ దోస తయారీ
బెంగళూరు బెన్నీ దోస తయారీకి ఉపయోగించేవి అన్నీ సహజమైన వస్తువులే. బియ్యం, సగ్గుబియ్యం, మినుములు, రాగులు, పచ్చి కొబ్బరిని ఉపయోగించి తయారు చేస్తారు. ఇవి మెత్తగా క్రిస్పీగా ఉంటాయి. ఈ దోసలకు కొబ్బరి, వేరు శనగ, పండుమిర్చి, దబ్బ కాయ చట్నీలతో పాటు కందిపొడి, నువ్వుల పొడి, నెయ్యి వేసి కస్టమర్స్ కు అందిస్తారు. స్వశక్తిని నమ్ముకుని నేడు మరికొందరికి పని కల్పించే దిశగా అడుగులు వేసిన అఖిల్, శ్రీయ దంపతులు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




