Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో శుభ శక్తిని పెంచే 5 మార్గాలు ఇవే..!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శక్తి సమతుల్యత సరిగ్గా లేకుంటే అనేక ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. మీ ఇంట్లో సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? అయితే మీరు తెలియకుండానే కొన్ని వాస్తు దోషాలను అనుసరిస్తుండవచ్చు. మీ ఇంటిని శుభ శక్తులతో నింపేందుకు ఈ వాస్తు సూచనలను తప్పకుండా పాటించండి.

వాస్తు శాస్త్రం ప్రకారం మీరు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పకుండా పాటించాలి. సమస్యలు క్రమంగా పెరుగుతున్నాయా..? మీకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయా..? అయితే మీరు తెలియకుండానే వాస్తు నియమాలను ఉల్లంఘించే అవకాశముంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను దృష్టిలో ఉంచుకుని ఉండటం అత్యంత అవసరం.. లేకపోతే మీ జీవితంలో ప్రతికూలతలు రావచ్చు.
వాస్తు శాస్త్రం జీవనశైలిని ప్రభావితం చేసే శక్తి ప్రవాహాన్ని విశదీకరిస్తుంది. ఈ శాస్త్రం ప్రకారం ఒక ఇంట్లో శుభ ఫలితాలు రావాలంటే కొన్ని నియమాలను పాటించాలి. వాస్తు ప్రకారం ఇంట్లో శుభ శక్తులు నిలకడగా ఉండాలంటే దాని నిర్మాణం, దాని లోపలి ఏర్పాట్లు వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాలి. కానీ చాలా మంది ఈ నియమాలను తెలియకుండానే ఉల్లంఘిస్తుంటారు. దీని వల్ల కొన్ని అనుకోని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
మీరు మీ మంచం ముందు అద్దం ఉంచి ఉంటే వెంటనే దాన్ని తొలగించటం మంచిది. వాస్తు ప్రకారం అద్దం నిద్రలేమిని, పీడకలలను కలిగించడమే కాకుండా ప్రతికూల శక్తిని కూడా కలిగిస్తుంది. దీని వల్ల మీ ఆరోగ్యం, మానసిక స్థితి మీద చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి మంచం ముందు అద్దం ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
వాస్తు ప్రకారం బాత్రూమ్, వంటగది ఒకే గోడకి ఆనుకుని ఉండకూడదు. ఇది వాస్తు దోషానికి దారితీస్తుంది. ఇలాంటప్పుడు మీ ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉండకూడదు. అది కాలం ఆగిపోయినట్లు, అభివృద్ధి నిలిచినట్లుగా సూచిస్తుంది. మీ జీవితంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి గడియారం పనిచేయకపోతే వెంటనే దాన్ని మరమ్మత్తు చేయించటం లేదా కొత్తదాన్ని కొనటం మంచిది.
ఇంట్లో ప్రధాన ద్వారం ముందు షూ రాక్ ఉంచడం వాస్తు ప్రకారం ప్రతికూలంగా పరిగణించబడుతుంది. ప్రతికూల శక్తి ఇంట్లోకి రావడానికి ఇది సహాయపడుతుంది. అందుకే ముఖ్యంగా ఇంట్లో ప్రవేశ ద్వారం ముందు అలాంటి ఏర్పాటు లేకుండా చూడాలి.
మీ మంచం తల ఉత్తర దిశ వైపు ఉంచితే అది మీ ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉత్తర దిశ వైపు నిద్రించడం మీ శరీర శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి మంచి ఆరోగ్యం కోసం దిశను సరిచేయటం అవసరం.