AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Life: సంపూర్ణ ఆరోగ్యంతో ఎక్కువకాలం జీవించాలంటే ఏం చేయాలి? పరిశోధకులు చెబుతున్న డైట్ ప్లాన్ ఇదే..

ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి? జీవన విధానంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వంటి అంశాలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం..

Healthy Life: సంపూర్ణ ఆరోగ్యంతో ఎక్కువకాలం జీవించాలంటే ఏం చేయాలి? పరిశోధకులు చెబుతున్న డైట్ ప్లాన్ ఇదే..
Healthy Food
Madhu
|

Updated on: Mar 22, 2023 | 1:55 PM

Share

పాత కాలంలో జనాలు వారి ఆహార అలవాట్లు, జీవన శైలి కారణంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతికేవారు. తమ జీవిత కాలంలో ట్యాబ్లెట్లు వాడకుండానే బతికేసిన వారూ మనకు కనిపిస్తారు. అయితే నేటి ఆధునిక ప్రపంచంలో అటువంటి జీవన శైలి అసాధ్యం. ఉరుకుల పరుగుల జీవితం, శారీరక శ్రమలేని జీవన విధానం, పని ఒత్తిళ్లు, లోపిస్తున్న పౌష్టికాహారం వెరసి ముప్పై ఏళ్లకు బీపీలు, షుగర్లు అటాక్ చేస్తున్నాయి. గుండె జబ్బులు ప్రబలుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి? జీవన విధానంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వంటి అంశాలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వారు చెబుతున్నదేంటి అంటే ఒకటే విధమైన ఆహారం ఎక్కువకాలం తీసుకోకూడదని.. అన్ని రకాల ఆరోగ్యకర ఆహార పదార్థాలను, కాలాలను బట్టి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఆ ఆహారంలో ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, కాయలు, చిక్కుళ్ళు వంటి మొక్కల ఆధారిత ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని వారు వివరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆహారమే ఆరోగ్యం..

పౌష్టికాహారం ఆహారం మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అయితే మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకొంటున్నారు అనేది ఇక్కడ ప్రాధాన్య అంశం. అమెరికాలో అత్యధిక శాతం నిపుణులచే ప్రోత్సహించబడుతున్న ఆరోగ్య కర ఆహార విధానాలను నాలుగు విభాగాలుగా చేసి.. 1,20,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఆ నాలుగు ఆహార విధానాలు ఏవి అంటే..హెల్తీ ఈటింగ్ ఇండెక్స్ 2015, ఆల్టర్నేట్ మెడిటరేనియన్ డైట్, హెల్త్‌ఫుల్ ప్లాంట్-బేస్డ్ డైట్, ఆల్టర్నేట్ హెల్తీ ఈటింగ్ ఇండెక్స్. ఇవి ఒకదానికొకటి కొంత భిన్నంగా ఉన్నప్పటికీ.. నాలుగూ పండ్లు, కూరగాయలు, కాయలు మరియు చిక్కుళ్ళు వంటి మొక్కల ఆధారిత ఆహారాలను ఎక్కువగా తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తాయి.

మూడు దశాబ్దాలపాటు సాగిన అధ్యయనం..

ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు మూడు దశాబ్దాలకు పైగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఆహార నియమాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాశారు. పైన పేర్కొన్న నాలుగు ఆరోగ్యకరమైన ఆహారపు విధానాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విధానాలను అనుసరించే వారు అధిక ఆరోగ్య ప్రయోజనాలు పొందారు. ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ లేదా శ్వాసకోశ వ్యాధులతో చనిపోయే అవకాశం తక్కువగా ఉందని ఆ డేటా చూపించింది.

ఇవి కూడా చదవండి

ఒకే రకమైన డైట్ అవసరం లేదు..

కాబట్టి ఆదర్శవంతమైన ఆరోగ్యకరమైన తినే విధానం ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట ఆహారంగా ఉండాల్సిన అవసరం లేదు. మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందించే సారూప్యత కలిగిన ఆహారం ఏదైనా కలిపి తీసుకోవచ్చు. ప్రజలు తమ పోషకాహార అవసరాలు, ఆహార ప్రాధాన్యతలను అనుసరించి.. వాటిని తీర్చడానికి సులభమైన ఆహార పదార్థాలపై దృష్టి పెట్టాలని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు జామా ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..