Kids Health: మీ పిల్లలు మంచి హైట్ పెరగాలనుకుంటున్నారా.. అయితే ఈ చిట్కాలను పాటించిచూడండి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలు ఎత్తు పెరగాలంటే.. శారీరక శ్రమ, చురుకు దనం ఉండటం చాలా ముఖ్యం. నేడు పిల్లల్లో శారీరక శ్రమ తక్కువగా ఉండడంతో పిల్లల్లో తగిన ఎత్తు ఎదగలేకపోతున్నారు. అయితే కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా, ఒక నెలలో ఎత్తులో మార్పును తీసుకురావచ్చు

మారుతున్న జీవనశైలి ప్రభావం పెద్దలపై మాత్రమే కాదు. చిన్న పిల్లలపై కూడా పడుతోంది. ముఖ్యంగా కరోనా కారణంగా చిన్నారుల శారీరక శ్రమ తగ్గిపోయింది. ఫోన్ చేయడం, ఇంట్లో ఎక్కువ సేపు ఉండడం వల్ల పిల్లల కదలికలు తగ్గాయి. దీంతో చిన్నారుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడింది. ఆరోగ్యమే కాదు.. పిల్లల శరీర ఎత్తు పెరుగుదలపై కూడా తీవ్ర ప్రభావం పడిందనే ఉదంతాలు కూడా తెరపైకి వస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలు ఎత్తు పెరగాలంటే.. శారీరక శ్రమ, చురుకు దనం ఉండటం చాలా ముఖ్యం. నేడు పిల్లల్లో శారీరక శ్రమ తక్కువగా ఉండడంతో పిల్లల్లో తగిన ఎత్తు ఎదగలేకపోతున్నారు. అయితే కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా, ఒక నెలలో ఎత్తులో మార్పును తీసుకురావచ్చు. Stylecraze.comలో ప్రచురించబడిన కథనంలో సూచించబడిన కొన్ని చిట్కాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము. మీరు మీ పిల్లల ఎత్తు వేగంగా పెరగాలనుకుంటే.. దాని కోసం ఈ పద్ధతులను అనుసరించండి.
HGH సప్లిమెంట్స్ మీ పిల్లలు త్వరగా ఎత్తు పెరగాలనుకునే వ్యక్తులలో మీరు ఒకరు అయితే.. HGH సప్లిమెంట్ మీకు ఉత్తమ ఎంపిక. ఇది అవసరమైన మల్టీవిటమిన్లు, గ్లూకామైన్ నుండి తయారు చేయబడింది. దీంతో ఈ లక్షణాలు శరీరంలో గ్రోత్ హార్మోనును పెంచడానికి పని చేస్తాయి. HGH మరో ప్రయోజనం ఏమిటంటే ఇది శరీరంలో శక్తిని కూడా పెంచుతోంది.
సమతుల్య ఆహారం ఎత్తు పెరగాలంటే శరీరంలో పోషకాలు సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. మీరు మీ పిల్లలకు సమతుల్య ఆహారం ఇవ్వాలి. క్యాల్షియం, ప్రోటీన్లు, కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు రోజూ తినే ఆహారంలో ఉప్పు , అధిక కొవ్వులను తగ్గించాలి. ఎత్తు పెరగడం కోసం మొలకలు, ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవడం అవసరం.



మసాజ్- యోగా మంచి ఎత్తు కోసం శారీరక మసాజ్, యోగా చేయడం కూడా అవసరం. మీరు పడుకునే ముందు అరగంట పాటు ఆలివ్ నూనెతో శరీరాన్ని మసాజ్ చేయాలి. అంతే కాకుండా నిద్ర లేవగానే యోగా చేసే అలవాటు చేసుకోండి. మీరు మీ బిడ్డ మంచి ఎత్తుగా ఉండాలనుకుంటే, ప్రతిరోజూ ఈ అలవాట్లను అలవాటు చేసుకోండి. మసాజ్, యోగా ద్వారా గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది.
పుషప్స్: ఎత్తు పెరిగే వయసులో ఉన్న పిల్లలు కనీసం రోజుకు ఒక్కసారైనా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ఒక ఇనుప రాడ్ ను 6 నుండి 8 అడుగుల ఎత్తులో ఉంచండి. ప్రతిరోజూ 10 నిమిషాల పాటు దానిపై వేలాడుతూ పుషప్స్ చేయమని పిల్లలకు చెప్పండి. అంతే కాకుండా సైకిల్ తొక్కడం వల్ల కూడా పిల్లలు ఎత్తు పెరుగుతారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ( ఇందులోని అంశాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. పాటించే ముందు ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)