Dry Ginger: అల్లం కంటే శొంఠితోనే మరిన్ని రోగాలకు చెక్.. అద్భుతం అంతే!
శొంఠి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. అల్లాన్ని బాగా ఎండబెడితే శొంఠి అవుతుంది. అల్లం కంటే శొంఠి మరింత పవర్ ఫుల్‌గా పని చేస్తుంది. ఇప్పుడంటే శొంఠిని ఎవరూ పెద్దగా ఉపయోగించడం లేదు. కానీ పూర్వం ఎక్కువగా శొంఠినే యూజ్ చేశారు. శొంఠిని ఆహారంలో ఒక భాగంగా తీసుకునేవారు. శొంఠి రసం, శొంఠి అన్నం తయారు చేసి వారంలో లేదా కనీసం నెలలో ఒక్కసారైనా తినేవారు. ఆరోగ్యానికి శొంఠి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో కూడా పలు దీర్ఘకాలిక..
శొంఠి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. అల్లాన్ని బాగా ఎండబెడితే శొంఠి అవుతుంది. అల్లం కంటే శొంఠి మరింత పవర్ ఫుల్‌గా పని చేస్తుంది. ఇప్పుడంటే శొంఠిని ఎవరూ పెద్దగా ఉపయోగించడం లేదు. కానీ పూర్వం ఎక్కువగా శొంఠినే యూజ్ చేశారు. శొంఠిని ఆహారంలో ఒక భాగంగా తీసుకునేవారు. శొంఠి రసం, శొంఠి అన్నం తయారు చేసి వారంలో లేదా కనీసం నెలలో ఒక్కసారైనా తినేవారు. ఆరోగ్యానికి శొంఠి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో కూడా పలు దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్ వ్యాధులను నివారించడానికి శొంఠిని ఉపయోగించేవారు. శొంఠి లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలతో బాధ పడేవారు శొంఠి తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇన్ని పోషక విలువలు ఉన్నా శొంఠిని తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాస్ సమస్యలు మాయం:
గ్యాస్ సమస్యలను దూరం చేయడంలో శొంఠి ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు ప్రతి రోజూ ఉదయం గోరు వెచ్చని నీటిలో కొద్దిగా శొంఠి కలిపి తాగితే.. మంచి ఉపశమనం వస్తుంది. శొంఠి పొడి దీర్ఘకాలిక అజీర్ణం వల్ల కడుపులో నొప్పి, కడుపులో అసౌకర్యం నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది.
మలబద్ధకం పరార్:
మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు తమ ఆహారంలో శొంఠిని చేర్చుకోండి. ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను వేగవంతం చేసి.. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం ఇస్తుంది.
ఇమ్యూనిటీ పెరుగుతుంది:
ఇప్పుడున్న కాలంలో అందరూ శరీరంలో తగిన శక్తి లేకుండా నీరసంగా, అలసటగా ఉంటున్నారు. ఇలాంటి వారు శొంఠిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇది రోగాలతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఈ శొంఠి పొడితో బరువు కూడా తగ్గుతారు.
వంటల్లో ఉపయోగించండి:
శొంఠి పొడిని వంటల్లో ఉపయోగించడం వల్ల ఆరోగ్యం పెరగడమే కాకుండా వంటలకు కూడా మంచి రుచి వస్తుంది. కానీ అల్లంతో పోల్చితో శొంఠి చాలా ఘాటుగా ఉంటుంది. చిటికెడు వేస్తే చాలు. ఈ శొంఠి పొడితో కఫం, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను త్వరితగతిన తగ్గించుకోవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..