Chanakya Niti: జాగ్రత్త! ఈ 4 లక్షణాలున్న మగవారిని నమ్మితే జీవితం నాశనమే!
భారతీయ రాజనీతి శాస్త్రంలో అసమానమైన స్థానమున్న ఆచార్య చాణక్యుడు కేవలం సామ్రాజ్య పాలనకే కాక, మానవ సంబంధాలకు కూడా గొప్ప మార్గనిర్దేశం చేశారు. ఆయన రచించిన 'నీతి శాస్త్రం' లో దాంపత్య బంధాలు, వ్యక్తిగత జీవిత సూత్రాలు విశేషంగా ఉన్నాయి. ఈ సూత్రాల ద్వారా మహిళలు తమ జీవితంలో ఎలాంటి పురుషులకు దూరంగా ఉండాలో, ఎవరిని విశ్వసించకూడదో స్పష్టంగా తెలియజేశారు. ఈ హెచ్చరికలు పాటించకపోతే జీవితం కష్టమౌతుందని చాణక్యుడు పేర్కొన్నారు.

గొప్ప పండితుడు ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్ర గ్రంథ రచన ద్వారా ఎన్నో విషయాలు ఈ తరం వారికి అందజేశారు. బంధాలు, బంధుత్వాలతో పాటు స్త్రీ పురుషుల గురించి కూడా పలు అంశాలు తెలిపారు. చాణక్యుడు తెలిపిన ప్రకారం, కొన్ని రకాల వ్యక్తులకు మహిళలు వీలైనంత దూరంగా ఉండాలి. ఆ లక్షణాలు గల పురుషులను అస్సలు నమ్మరాదన్నారు.
1. అబద్ధాలు చెప్పే మోసగాళ్లు
బంధాలలో నమ్మకమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. తరచూ అబద్ధాలు చెప్పే పురుషులను స్త్రీలు ఎప్పుడూ నమ్మరాదు. అబద్ధాలు చెప్పేవారు తమ సౌలభ్యం కోసం ఎప్పుడైనా అసత్యాలను ఆశ్రయిస్తారు. అలాంటి వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు. ఈ పురుషులు మధురంగా మాట్లాడి విశ్వాసం గెలుచుకుంటారు. కానీ, సమయం వచ్చినప్పుడు మోసం చేస్తారు.
2. నియంత్రించాలని చూసేవారు
నేటికీ చాలామంది పురుషులు స్త్రీలను తమ ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తారు. మహిళల స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేసేవారు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు. అలాంటి వారు స్త్రీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. స్వేచ్ఛను అడ్డుకునే వారికి దూరంగా ఉండమని నీతి శాస్త్రం చెప్తుంది.
3. దురాశ కలిగిన స్వార్థపరులు
కొంతమంది మగవారు తమ స్వలాభం కోసం మాత్రమే మహిళలతో సంబంధాలు కొనసాగిస్తారు. స్వార్థపరులైన వ్యక్తులకు మహిళలు దూరంగా ఉండటం మంచిది. కష్ట సమయాలలో వీరు తోడుగా నిలవరు. మిమ్మల్ని నిజంగా గౌరవిస్తూ, కష్టకాలంలో అండగా ఉండే వ్యక్తులను మాత్రమే విశ్వసించాలి.
4. ప్రతికూల ఆలోచనలు ఉన్నవారు
మీరు జీవితంలో ఎదుగుతుంటే చూసి అసూయపడేవారు, లేదా మీ గురించి చెడుగా మాట్లాడే మగవారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తుల ప్రతికూల ఆలోచనలు మహిళల ఉత్సాహాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాక, నిరాశలోకి నెట్టేస్తాయి. కాబట్టి, అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మహిళలకు శ్రేయస్కరం.




