NO: ఇలా నో చెప్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు.. బాధపడతారు అనే ఆలోచన కూడా రాదు. అదెలాగంటే?
ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్.. ఇలా ఒక్కోసారి ఒక్కొక్కరు. డబ్బులు కావాలనో, మన వస్తువును కొద్ది రోజులు వాడుకోవడానికి ఇవ్వాలనో, మనకి తెలిసిన వాళ్లతో ఏదైనా పని చేయించాలనో.. ఇలా ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒక్కసారైనా మొహమాటంతో కాదు, లేదు, కుదరదు అని చెప్పే పరిస్థితులు

ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్.. ఇలా ఒక్కోసారి ఒక్కొక్కరు. డబ్బులు కావాలనో, మన వస్తువును కొద్ది రోజులు వాడుకోవడానికి ఇవ్వాలనో, మనకి తెలిసిన వాళ్లతో ఏదైనా పని చేయించాలనో.. ఇలా ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒక్కసారైనా మొహమాటంతో కాదు, లేదు, కుదరదు అని చెప్పే పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటి సమయంలో ఏం చేయాలో తెలియదు. సరే అని సహాయం చేసేంత సమయం కేటాయించలేం. అప్పుడే నో చెప్పాలి. అది ఎలా చెప్తే అవతలి వాళ్లు బాధపడకుండా ఉంటారు.
ఈ రోజుల్లో “నో” చెప్పడం నేర్చుకోకపోతే మన సమయం, శక్తి రెండూ వృథా అవుతాయి. మొహమాటం, ఇతరులు ఏమనుకుంటారో అనే భయం వల్ల చాలామంది తమ ఇష్టాఇష్టాలను దాచేసుకుంటారు. ఫలితంగా మనమే ఇబ్బంది పడతాం. అంతేకాదు, అవతలి వాళ్ల దృష్టిలో కూడా మన విలువ తగ్గిపోతుంది. అదే సమయంలో “నో” చెప్పడం అంటే కఠినంగా కాదని చెప్పడం మాత్రం కాదు, సున్నితంగా తిరస్కరించడం అని గుర్తుంచుకోండి. నో చెప్పవలసి వచ్చినప్పుడు ఏం ఆలోచించాలి అనే విషయాలను తెలుసుకుందాం..
వీలైతే ప్రత్యామ్నాయం చూపాలి
ఎవరైనా సహాయం కోసం అడిగితే, “ఇప్పుడు నాకు వేరే పని ఉంది, బాధపడుతున్నాను కానీ రాలేకపోతున్నాను” అని చెప్పండి. ఇలా చెప్తే వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.
ముందుగా మీ ప్రాధాన్యతలు గుర్తించాలి
అడిగిన విషయం మీకు ముఖ్యమా కాదా అని ఆలోచించండి. కాకపోతే “ఇది నాకు ప్రస్తుతం ఉపయోగం లేదు, సారీ” అని మృదువుగా చెప్పేయండి. గొంతు కరుకుగా ఉంటే బాధపడొచ్చు. మెల్లగా, మృదువైన టోన్‌లో చెప్తే మంచిది.
లిమిటేషన్స్ పెట్టాలి
ఎంతటి సన్నిహితులైనా కొన్ని విషయాల్లో స్పష్టమైన హద్దులు ఉండాలి. లేకపోతే మీరు అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మాటల్లో మృదుత్వం
“I’m really sorry, I can’t help you right now” లాంటి వాక్యాలు ఉపయోగించండి. కర్రతో కొట్టినట్టు చెప్పకండి. అలా చెప్తే బాధపడతారని గుర్తుంచుకోండి.
“నో” చెప్పడం కూడా మన హక్కు. దానిని సున్నితంగా, గౌరవంగా చెబితే ఎవరూ బాధపడరు. మీ విలువ కూడా పెరుగుతుంది. మొహమాటాన్ని పక్కన పెట్టేయాలి. మీ సమయం, మీ మనసు మీవి!




