AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Formula: మీ లైఫ్‌లో సక్సెస్‌ కోసం తహతహలాడుతున్నారా? అయితే ఈ 3 పనులు చేయండి చాలు

లైఫ్ లో సక్సెస్ సాధించాలని, పట్టిందల్లా బంగారం కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ఏ కొందరికో ఇది సాధ్యం అవుతుంది. మీ జీవితంలో కూడా విజయం రుచి ఆస్వాధించాలంటే ఈ కింద చాణక్యుడు చెప్పిన మూడు పనులు చేయండి.. విజయమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది..

Success Formula: మీ లైఫ్‌లో సక్సెస్‌ కోసం తహతహలాడుతున్నారా? అయితే ఈ 3 పనులు చేయండి చాలు
Success Formula
Srilakshmi C
|

Updated on: Dec 03, 2024 | 1:44 PM

Share

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయాలు సాధించాలని కోరుకుంటారు. జీవితంలో సక్సెస్‌ కావాలని, అనుకున్నది సాధించాలని కోరుకోవడం సహజం. కానీ కొందరికే ఇది దక్కుతుంది. ప్రతి వ్యక్తి తన జీవితాంతం వీటి కోసం పోరాడుతుంటాడు. ప్రతి ఒక్కరికి ఒక్కో విధమైన విజయం కావాలి. కానీ ఈ విజయ మార్గంలో కాస్తింత అదృష్టం కూడా తోడైతే తాకినదంతా బంగారంగా మారుతుంది. అయితే జీవితంలో ఈ మూడు పనుతు చేస్తే విజయం తప్పక చేరువవుతుందని చాణక్యుడు చెబుతున్నాడు. కాబట్టి విజయం వెంట పరుగెత్తే వ్యక్తి ఈ మూడు విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అవేంటంటే..

స్నేహితులను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర అపారమైనది. కాబట్టి ఏ వ్యక్తి అయినా స్నేహితుల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన వ్యక్తిని స్నేహితుడిగా ఎన్నుకోవాలి. సంతోషం, దుఃఖంలో మీకు మద్దతు ఇచ్చేవారు, కష్ట సమయాల్లో మీకు అండగా నిలిచేవారు నిజమైన స్నేహితులు. ఒక మంచి పనికి మంచి స్నేహితుడు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తాడు. కానీ చెడ్డ వ్యక్తితో స్నేహం పని, లక్ష్యాలపై దృష్టిని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా చెడ్డవారి సహవాసంలో ఉంటే, వెంటనే ఆ స్నేహానికి వీడ్కోలు చెప్పడం మంచిదని చాణక్యుడు చెబుతున్నాడు.

ఓపికగా, క్రమశిక్షణతో ఉండాలి

ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నిరంతరం పని చేయడం చాలా ముఖ్యం. అందుకు సహనం, సంయమనం చాలా అవసరం. ఈ లక్షణాలు క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి ఎంతో సహాయపడతాయి. ఏ విషయంలోనైనా తొందరపడకుండా ఓపికగా, శ్రద్ధగా పని చేయడంపై దృష్టి పెట్టాలని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం

విజయవంతమైన జీవితంవైపు అడుగువేయాలంటే సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. సమయాన్ని వృధా చేసే వ్యక్తులు జీవితంలో ఏమీ సాధించలేరు. సమయాన్ని గౌరవించి, సమయానికి అన్ని పనులను పూర్తి చేసే వ్యక్తి మాత్రమే జీవితంలో విజయానికి దగ్గరగా ఉంటాడు. ఆ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకునే గుణం కలిగి ఉండాలని చాణక్యుడు తెలిపాడు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
స్టవ్ లేకపోయినా టెన్షన్ లేదు.. మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఈజీగా
స్టవ్ లేకపోయినా టెన్షన్ లేదు.. మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఈజీగా
ప్రాణంగా ప్రేమిస్తే ఎలా వదిలేస్తారు.. ? అర్జున్ దాస్
ప్రాణంగా ప్రేమిస్తే ఎలా వదిలేస్తారు.. ? అర్జున్ దాస్
ప్రపంచ విజేత టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్
ప్రపంచ విజేత టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్
రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా? కళ్లకే కాదు, ఆరోగ్యానికి
రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా? కళ్లకే కాదు, ఆరోగ్యానికి
వాట్సప్‌లో సెకన్లలోనే గ్యాస్ బుకింగ్.. జస్ట్ ఈ మెస్సేజ్ పెడితే..
వాట్సప్‌లో సెకన్లలోనే గ్యాస్ బుకింగ్.. జస్ట్ ఈ మెస్సేజ్ పెడితే..
టీమ్ మేనేజ్‌మెంట్‌ను కాల్చి చంపాలి.. మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
టీమ్ మేనేజ్‌మెంట్‌ను కాల్చి చంపాలి.. మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
రూ.27.5 కోట్లతో ఫ్లాట్లు కొన్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ హీరో?
రూ.27.5 కోట్లతో ఫ్లాట్లు కొన్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ హీరో?
వార్‌ ఎఫెక్ట్.. కేజీ టమోటా రూ.250, ఉల్లిపాయ 175.. కన్నీళ్లు పెట్ట
వార్‌ ఎఫెక్ట్.. కేజీ టమోటా రూ.250, ఉల్లిపాయ 175.. కన్నీళ్లు పెట్ట
అమ్మో ..ఇదేం భక్తి యాత్ర బాబోయ్.. కాళ్లకు కర్రలు కట్టుకొని..
అమ్మో ..ఇదేం భక్తి యాత్ర బాబోయ్.. కాళ్లకు కర్రలు కట్టుకొని..
వీడు మహా కంత్రీ.. సైబర్ కేటుగాళ్లకే సాయం..!
వీడు మహా కంత్రీ.. సైబర్ కేటుగాళ్లకే సాయం..!