AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: మీ పిల్లలకు మీరు మంచి తండ్రిగా ఉండాలనుకుంటున్నారా? అయితే వీటిని మరవకండి

తల్లిదండ్రులకు పిల్లలే ఆస్తులు. అయితే కొందరు తండ్రులు పిల్లల పెంపకంపై అంత శ్రద్ధ పెట్టరు. పైగా తమ మాట వినడం లేదని కంప్లైంట్ చేస్తుంటారు. పిల్లలు మీ మాట వినాలంటే ముందు వారికి మీరు మంచి తండ్రిగా ఉండాలి. అలా ఉండాలంటే ఈ కింది విధంగా మీరు ఉండాలి..

Parenting Tips: మీ పిల్లలకు మీరు మంచి తండ్రిగా ఉండాలనుకుంటున్నారా? అయితే వీటిని మరవకండి
Parenting Tips
Srilakshmi C
|

Updated on: Dec 03, 2024 | 1:29 PM

Share

పిల్లలందరి జీవితంలో వారి తండ్రి ఫస్ట్‌ రోల్ మోడల్‌గా ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు మాత్రం తమ తండ్రితో మాట్లాడేందుకు చాలా భయపడిపోతుంటారు. తమ ఇష్టాలను, కష్టాలను పంచుకోవడానికి వెనుకాడతారు. చూడ్డానికి చాలా కరుకుగా, తొందరగా కోపం వచ్చే తండ్రులు కూడా తమ పిల్లల విషయంలో మృదువుగా ఉండాలంటున్నారు నిపుణులు. పిల్లలకు ఎటువంటి బాధ కలిగించని ఉత్తమ, ఇష్టమైన తండ్రిగా మారడానికి ఈ కింది కొన్ని చిట్కాలు ట్రై చేయండి. అవేంటంటే..

పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడం

ప్రతిరోజూ పిల్లలతో కొంత సమయం గడపడం ఉత్తమ తండ్రి లక్షణాలలో ఒకటి. వారి ఇష్టమైన కార్యకలాపాలలో తండ్రులు పాల్గొనాలి. వారి రోజువారీ స్కూల్‌ విశేషాలను వినడం చాలా ముఖ్యం. పిల్లలు దేనిపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారో గమనించి, వారి ఇష్టాయిష్టాలకు మీరూ చేయూతనివ్వాలి.

అపరిమితమైన ప్రేమను అందించడం.. సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం

పిల్లల పట్ల అపరిమిత ప్రేమ, శ్రద్ధ చూపే వ్యక్తి ఉత్తమ తండ్రిగా ఉంటాడు. పిల్లలు ఏ పని చేయాలన్నా అందులో తమ వంతు చేయూత ఇవ్వాలి. అడిగినవన్నీ ఇవ్వడంతో సురక్షితమైన వాతావరణాన్ని, భవిష్యత్తును నిర్మించడంలో తండ్రి ముఖ్య పాత్ర పోషించాలి.

ఇవి కూడా చదవండి

పిల్లల మొదటి స్నేహితుడిగా ఉండాలి

పిల్లలకు తల్లిదండ్రులే మంచి స్నేహితులు. తండ్రి తన పిల్లలతో సత్సంబంధాలతో ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా ఉండాలి. పిల్లలను స్నేహితులుగా చూడటం ద్వారా, వారి తప్పులను సరిదిద్దడం ద్వారా వారికి మంచి జీవితాన్ని ఇచ్చినవారు అవుతారు.

మంచి సంభాషణకర్తగా ఉండాలి

పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి వారి జీవితంలో అధికంగా నేర్చుకుంటారు. ప్రపంచంలోని అత్యుత్తమ తండ్రి అని పిలవడానికి మంచి సంభాషణకర్తగా ఉండటం చాలా ముఖ్యం. మంచి మాటలతో మీ పిల్లలతో మాట్లాడితే వారు మీ మాట వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వడంతో పాటు, మీ స్వంత మాటలతో పిల్లలకు సలహాలు ఇవ్వడం అవసరం.

మీ పిల్లలకు గురువుగా ఉండాలి

తండ్రి తన పిల్లలకు మంచి గురువుగా ఉండాలి. పిల్లల జీవితాన్ని నడిపించే గురువుగా వారి భవిష్యత్తుకు బాటలు వేయాలి. అలాగే తప్పని సరిగా వారికి మంచి చెడులను తెలియజేయాలి. పిల్లల పెరుగుదల, అభివృద్ధికి తండ్రి శ్రద్ధ, మార్గదర్శకత్వం చాలా ముఖ్యం.

పిల్లలకు ప్రేరణ కలిగించే శక్తిగా తండ్రి ఉండాలి

ప్రతి తండ్రి పిల్లలను ప్రోత్సహిస్తే సరిపోదు. ప్రేరణ పొందడం కూడా చాలా ముఖ్యం. పిల్లలను స్వతంత్రంగా, వారి స్వంత కాళ్ళపై నిలబడేలా చేయాలి. పిల్లలతో దురుసుగా ప్రవర్తించకుండా ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో బతకడం నేర్పించాలి.

పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి

ఉత్తమ తండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే, పిల్లలకు పోషకాహారం అందించడం, వ్యాయామం వంటి కార్యకలాపాలలో పాల్గొనేలా చేసేలా ప్రోత్సహించడం వంటివి చేయాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
స్టవ్ లేకపోయినా టెన్షన్ లేదు.. మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఈజీగా
స్టవ్ లేకపోయినా టెన్షన్ లేదు.. మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఈజీగా
ప్రాణంగా ప్రేమిస్తే ఎలా వదిలేస్తారు.. ? అర్జున్ దాస్
ప్రాణంగా ప్రేమిస్తే ఎలా వదిలేస్తారు.. ? అర్జున్ దాస్
ప్రపంచ విజేత టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్
ప్రపంచ విజేత టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్
రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా? కళ్లకే కాదు, ఆరోగ్యానికి
రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా? కళ్లకే కాదు, ఆరోగ్యానికి
వాట్సప్‌లో సెకన్లలోనే గ్యాస్ బుకింగ్.. జస్ట్ ఈ మెస్సేజ్ పెడితే..
వాట్సప్‌లో సెకన్లలోనే గ్యాస్ బుకింగ్.. జస్ట్ ఈ మెస్సేజ్ పెడితే..
టీమ్ మేనేజ్‌మెంట్‌ను కాల్చి చంపాలి.. మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
టీమ్ మేనేజ్‌మెంట్‌ను కాల్చి చంపాలి.. మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
రూ.27.5 కోట్లతో ఫ్లాట్లు కొన్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ హీరో?
రూ.27.5 కోట్లతో ఫ్లాట్లు కొన్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ హీరో?
వార్‌ ఎఫెక్ట్.. కేజీ టమోటా రూ.250, ఉల్లిపాయ 175.. కన్నీళ్లు పెట్ట
వార్‌ ఎఫెక్ట్.. కేజీ టమోటా రూ.250, ఉల్లిపాయ 175.. కన్నీళ్లు పెట్ట
అమ్మో ..ఇదేం భక్తి యాత్ర బాబోయ్.. కాళ్లకు కర్రలు కట్టుకొని..
అమ్మో ..ఇదేం భక్తి యాత్ర బాబోయ్.. కాళ్లకు కర్రలు కట్టుకొని..
వీడు మహా కంత్రీ.. సైబర్ కేటుగాళ్లకే సాయం..!
వీడు మహా కంత్రీ.. సైబర్ కేటుగాళ్లకే సాయం..!