చాణక్య నీతి: ఇంటా, బయటా అలాంటి వారిని అస్సలు నమ్మొద్దు.. ముంచెస్తారు జాగ్రత్త!
ఆచార్య చాణక్యుడు నేటి కాలంలో మానవులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సరైన పరిష్కారాలను చూపారు. మానవులు తమ జీవితాన్ని ఎలా గడపాలి? ఎలాంటి తప్పులు చేయకూడదో వివరించారు. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అనే విషయాల గురించి కూడా స్పష్టంగా తెలియజేశారు. జీవితంలో మనం కొంత మందిని నమ్మకూడదని, వారిని నమ్మితే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

భారత ఆర్థిక, నీతి శాస్త్ర పితామహుడైన ఆచార్య చాణక్యుడు నేటి కాలంలో మానవులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సరైన పరిష్కారాలను చూపారు. మానవులు తమ జీవితాన్ని ఎలా గడపాలి? ఎలాంటి తప్పులు చేయకూడదో వివరించారు. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అనే విషయాల గురించి కూడా స్పష్టంగా తెలియజేశారు. ఆచార్య చాణక్యుడు మానవ జీవిత సారాంశాన్ని తన నీతిశాస్త్రంలో వివరించారు. జీవితంలో మనం కొంత మందిని నమ్మకూడదని, వారిని నమ్మితే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇలాంటి వారే ప్రమాదకరం
మనం చాలాసార్లు గుడ్డిగా నమ్మి ఇబ్బందుల్లో పడుతుంటాం. దాని వల్ల మనం చాలా బాధపడాల్సి వస్తుంది. కానీ అలాంటి వారిని నమ్మకూడదని, వారి నుంచి ఏమీ ఆశించకూడదని సూచిస్తున్నారు. సమాజంలో కొంత మంది బయట నుంచి మీ శ్రేయోభిలాషులుగా నటిస్తారని చాణక్యుడు చెబుతున్నారు. వారు మీతో చాలా ప్రేమగా వ్యవరిస్తారని.. కానీ, వారి హృదయంలో వారు ఎల్లప్పుడు మీ గురించి మంచి ఆలోచించరు. మీకు హాని కలిగించే అవకాశం వచ్చినప్పుడల్లా ఇలాంటి వ్యక్తులు ముందుంటారు. అలాంటి వ్యక్తులు బహిరంగ శత్రువుల కంటే ప్రమాదకరమని హెచ్చరించారు చాణక్యుడు.
మనం మన శత్రువుల గురించి తెలసుకున్నప్పుడు జాగ్రత్త పడతాం. దీంతో మనం వారి వల్ల కలిగి నష్టం నుంచి తప్పించుకుంటాం. అయితే, కొంతమంది మాత్రం మనతో స్నేహపూర్వకంగా ఉంటూనే.. మనకు ద్రోహం చేస్తుంటారు. అందుకే అలాంటి వారిని ముందుగా గుర్తించాలి. వారి నుంచి ఎప్పుడూ సాయం ఆశించకూడదు. ఎందుకంటే వారు మనకు సహాయం చేసినట్లుగా నటిస్తూ.. చివరకు ఊహించని నష్టం చేస్తారు.
స్వార్థపరుల నుంచి ఎప్పుడూ సహాయం ఆశించవద్దని చాణక్యుడు చెప్పారు. అలాంటి వ్యక్తులు అవకాశం వచ్చినప్పుడల్లా తమ సొంత ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటారు. అలాంటి వ్యక్తులు మీ నుంచి ప్రయోజనం పొందుతారు కానీ.. సాయం మాత్రం చేయరు. అలాంటి వ్యక్తుల నుంచి నిస్వార్థ సాయం ఎప్పుడూ ఆశించకూడదు. ఎందుకంటే అలాంటి వారు మీకు మీ నుంచి ఏమీ ఆశించకుండా సాయం చేయరు అని చాణక్యుడు స్పష్టం చేశారు.
