AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు తాగే నీరు నిజంగా సురక్షితమైనదేనా? ఈ సింపుల్‌ టెస్ట్‌తో.. ఇంట్లోనే నీటి నాణ్యతను చెక్‌ చేయండి!

Water Quality Test: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఒక విషాద సంఘటన యావత్తు దేశాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఆ ప్రాంతానికి సరఫరా అయ్యే తాగ్రునీరు కలుషితం కావడంతో.. వాటిని తాగిన స్థానిక జనాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందరు తీవ్ర అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ నీటి తాగి మరణించిన వారి సంఖ్య ప్రస్తుతం 15కు చేరింది. ఇంకా ఎంతో మంది హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ జనాలు నివసిస్తున్న ప్రాంతానికి చాలా కాలంగా మురికి నీరు సరఫరా అవుతుందని. దాన్ని గమనించకుండా తాగిన ప్రజలు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

మీరు తాగే నీరు నిజంగా సురక్షితమైనదేనా? ఈ సింపుల్‌ టెస్ట్‌తో.. ఇంట్లోనే నీటి నాణ్యతను చెక్‌ చేయండి!
Drinking Water Safety
Anand T
|

Updated on: Jan 04, 2026 | 10:37 AM

Share

ఇది ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ఉన్న సమస్య కాదు.. చాలా ప్రాంతాల్లో ఈ కలుషిత నీటి సమస్య ఉంది. గత కొన్ని రోజులు క్రితం మన హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కలుషిత నీరు సరఫరా అయినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఇటీవలే జలమండలి అధికారులు సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై కలుషిత నీటి సమస్యే ఉండదని తెలిపారు. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతో ముఖ్యం. కాబట్టి మనం తాగే నీరు సురక్షితమైనవేనా, కాదా అనేది ఎలా టెస్ట్ చేయాల తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కలుషిత నీటిని టెస్ట్ చేసేందుకు టెస్ట్ చేసేందుకు ఒక కిట్‌లను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ కిట్‌లు ద్వారా కాలుషిత నీటిని ఈజీగా గుర్తించవచ్చని వారు చెబుతున్నారు. కాబట్టి మనం తాగే నీరు సురక్షితమైనదా కాదా అనేది ఇంట్లోనే ఎలా టెస్ట్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

నీరు సురక్షితమైనదా, కాదా తెలుసుకోవడం ఎలా.. ఏ నీటి పరీక్షా కిట్ ఉత్తమమైనది?

కోలిఫాం ఇ. కోలి టెస్ట్ కిట్: నీటి నాణ్యతను పరీక్షించేందుకు ఈ కిట్ అత్యంత నమ్మదగినదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే మీరు ఈ కిట్ ద్వారా నీటి నాణ్యతను టెస్ట్ చేసినప్పుడు 90 శాతం ఖచ్చితమైన రిజల్ట్‌ ఇస్తుందట. ఇది నీటిలోని ఎంతశాతం చెడు బ్యాక్టీరియా ఉందో గుర్తిస్తుంది. ఆ నీటిని మీరు తాగడం సురక్షితమైనదా లేదా కూడా తెలియజేస్తుంది. ఇంట్లో ఈ పరీక్ష చేసేందుకు మీరు ముందుగా ఒక బాటిలో వాటర్ తీసుకొని అందులో రియాజెంట్ వేసి పక్కన పెట్టండి.. 18-24 గంటల తర్వాత బాటిల్‌లోని నీరు రంగుమారితే.. అవి కలుషితమైన నీరు అని అర్థం. రంగు మారకపోతే అవి సురక్షితమైన నీరు అని అర్థం.

క్లోరిన్ టెస్టింగ్ కిట్: సాధారణంగా సూక్ష్మజీవులను చంపడానికి నీటిలో క్లోరిన్‌ను కలుపుతారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ క్లోరిన్ టెస్టింగ్‌ కిట్ అనేది మీరు సరఫరా అయ్యే నీటిలో క్లోరిన్ స్థాయిలను కొలుస్తుంది. ఇంట్లో ఈ టెస్ట్ చేసేందుకు మీరు స్ట్రిప్ లేదా లిక్విడ్‌ను ఉపయోగించొచ్చు. వీటని ఉపయోగించినప్పుడు.. నీటి రంగు మారితే అది క్లోరిన్ ఎక్కువగా ఉన్న నీరని అర్థం. అది తాగడానికి సురక్షితం కాదు. నీటిలో ఈ క్లోరిన్ పర్సెంటేజ్ తగిన మోతాదులో ఉంటే ఆ నీరు తాగడానికి సురక్షితమే.. మోతాదుకు మించి నీటిలో క్లోరిన్ ఉంటే వాటని అస్సలు తాగొద్దు.

టర్బిడిటీ టెస్ట్ ట్యూబ్: కొన్ని సార్లు భారీ వర్షం, లేదా లీకేజీ కారణంగా మనకు సరఫరా అయ్యే నీరు మురికిగా వస్తాయి. అలాంటి నీటిటి టెస్ట్ చేసేందుకు ఈ టర్బిడిటీ టెస్ట్‌ కిట్‌ ఉపయోగపడుతుంది. మీకు సరఫరా అయ్యే నీరు సురక్షితమైనదా, కాదా అనేది తెలుసుకునేందుకు ఒక టర్బిడిటీ ట్యూబ్‌ను తీసుకొని దానిని నీటుగా శుభ్రం చేసి.. మీ దగ్గర ఉన్న నీటిని అందులో పోయండి. ఆ ట్యూబ్‌ను చేతిలో పట్టుకొని సూర్యకాంతికి వ్యతిరేక దిశలో ఉంచంది, కాసేపటి తర్వాత ట్యూబ్‌లోని నీటిని మొల్లగా పారపోయండి.. అప్పుడు ట్యాబ్ అడుగున మీరు నల్లటి మలినాలు కనిపిస్తాయి. అంటే అది కలుషితమైన నీరు అని అర్థం.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అభిమానులకు బిగ్ షాక్.. విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్..
అభిమానులకు బిగ్ షాక్.. విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్..
నాన్‌వెజ్ లవర్స్‌కు గుండెపగిలే వార్త.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
నాన్‌వెజ్ లవర్స్‌కు గుండెపగిలే వార్త.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం.. అరుదైన కుడ్య శిల్పం ఇదిగో
అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం.. అరుదైన కుడ్య శిల్పం ఇదిగో
సచిన్‌ను ‘బ్రాండ్’గా మార్చిన ఆ మాస్టర్ మైండ్ ఇతనే..!
సచిన్‌ను ‘బ్రాండ్’గా మార్చిన ఆ మాస్టర్ మైండ్ ఇతనే..!
40 ఏళ్ల తర్వాత మర్చిపోని చంద్రబోస్..! ఏకంగా రూ.40 లక్షలతో
40 ఏళ్ల తర్వాత మర్చిపోని చంద్రబోస్..! ఏకంగా రూ.40 లక్షలతో
తిరుమల వెళ్లేవారికి మరో శుభవార్త..
తిరుమల వెళ్లేవారికి మరో శుభవార్త..
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!