AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బూరెల్లా కాదు.. బెలూన్లలా ఉబ్బిన బుగ్గలు.. 30 ఏళ్ల కష్టానికి ఫలితం!

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామానికి చెందిన 48 ఏళ్ల జాంగ్ గత 30 సంవత్సరాలుగా గ్వాంగ్‌డాంగ్‌లోని ఒక గాజు తయారీ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. అతని పని కరిగిన గాజుపై పైపు ద్వారా ఊదడం. ఈ పనిని సుదీర్ఘకాలంపాటు చేయడంతో అతని బుగ్గలు బెలూన్లలా ఉబ్బిపోయేలా చేశాయి. ఆయన ముఖ కండరాలు అసాధారణంగా అభివృద్ధి చెందాయి. దీని వల్ల అని చెంపలు బెలూన్లలా మారిపోయాయి.

బూరెల్లా కాదు.. బెలూన్లలా ఉబ్బిన బుగ్గలు.. 30 ఏళ్ల కష్టానికి ఫలితం!
Blower
Rajashekher G
|

Updated on: Jan 04, 2026 | 12:05 PM

Share

సాధారణంగా మీ బుగ్గలు బూరెల్లా ఉన్నాయి అంటారు. వారి చెంపలు కొంచెం ఉబ్బుగా ఉంటే ఇలా అంటారు. కానీ, చైనాకు చెందిన ఒక వ్యక్తి బుగ్గలు మాత్రం బూరెల్లా కాదు.. బెలూన్లలా ఉబ్బిపోయాయి. ఇందులో అతని 30 ఏళ్ల కష్టం దాగివుంది. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు కష్టమైన పని అయినప్పటికీ ఆయన దాన్ని కొనసాగించారు. ఒక కంపెనీలో 30 ఏళ్లుగా బ్లోవర్‌గా పనిచేయడంతో ఆయన చెంపలు బెలూన్లలా ఉబ్బాయి.

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామానికి చెందిన 48 ఏళ్ల జాంగ్ గత 30 సంవత్సరాలుగా గ్వాంగ్‌డాంగ్‌లోని ఒక గాజు తయారీ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. అతని పని కరిగిన గాజుపై పైపు ద్వారా ఊదడం. ఈ పనిని సుదీర్ఘకాలంపాటు చేయడంతో అతని బుగ్గలు బెలూన్లలా ఉబ్బిపోయేలా చేశాయి. ఆయన ముఖ కండరాలు అసాధారణంగా అభివృద్ధి చెందాయి. దీని వల్ల అని చెంపలు బెలూన్లలా మారిపోయాయి.

ఫ్రాగ్ ప్రిన్స్

జాంగ్‌ను అతని సహోద్యోగులు ప్రేమగా “బిగ్ మౌత్ బ్రదర్” అని పిలుస్తారు, అతను తనను తాను సరదాగా “ఫ్రాగ్ ప్రిన్స్” అని పిలుచుకుంటాడు. కప్పల చెంపలు కూడా ఉబ్బుగా ఉండటంతో ఆయన తనను తాను అలా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది.

సోషల్ మీడియాలో వైరల్

జాంగ్ పొటోలు, వీడియోలు చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్‌లో ఆయన పనికి సంబంధించిన వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. జాంగ్.. 1.5 మీటర్ల పొడవున్న మెటల్ పైపును ఉపయోగించి 1,000 డిగ్రీల సెల్సియస్‌కు పైగా వేడిచేసిన తర్వాత కరిగిన గాజును ఎత్తి పైపు ద్వారా గాలిని ఊదుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. వీడియోలో, అతను గాజును ఆకృతి చేయడానికి పైపును జాగ్రత్తగా తిప్పుతూ అదే సమయంలో దానిపై ఊదుతున్నట్లు చూడవచ్చు.

మొదట సాధారణంగానే ఉన్న జాంగ్ ముఖం

వర్క్‌షాప్‌లో వేడి కారణంగా, జాంగ్ తరచుగా చొక్కా లేకుండా పనిచేస్తాడు. ఈ పనిలో చేరే సమయంలో జాంగ్.. ముఖం సాధారణంగా ఉండేది. కానీ, కాలక్రమేణా, నిరంతరం ఊదడం వల్ల, అతని ముఖ కండరాలు సాగడం ప్రారంభించాయని జాంగ్ తెలిపారు. క్రమంగా, జాంగ్ బుగ్గలు బెలూన్‌ల వలె ఉబ్బిపోయాయి.

సోషల్ మీడియా స్పందన

జాంగ్ కథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఆయన రూపాన్ని తాను హాస్యాస్పదంగా చూడలేనని.. నిజానికి నేను ఆయనను ఆరాధిస్తానని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. సంవత్సరాలు తన కుటుంబ పోషణ కోసం ఆయన పడిన కష్టం హృదయాన్ని కదిలిస్తోందని పేర్కొన్నాడు. జాంగ్ ఒక అద్భుతమైన వ్యక్తి అని.. తన కుటుంబం కోసం తన జీవితాన్ని ధారపోశాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

అభిమానులకు బిగ్ షాక్.. విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్..
అభిమానులకు బిగ్ షాక్.. విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్..
నాన్‌వెజ్ లవర్స్‌కు గుండెపగిలే వార్త.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
నాన్‌వెజ్ లవర్స్‌కు గుండెపగిలే వార్త.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం.. అరుదైన కుడ్య శిల్పం ఇదిగో
అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం.. అరుదైన కుడ్య శిల్పం ఇదిగో
సచిన్‌ను ‘బ్రాండ్’గా మార్చిన ఆ మాస్టర్ మైండ్ ఇతనే..!
సచిన్‌ను ‘బ్రాండ్’గా మార్చిన ఆ మాస్టర్ మైండ్ ఇతనే..!
40 ఏళ్ల తర్వాత మర్చిపోని చంద్రబోస్..! ఏకంగా రూ.40 లక్షలతో
40 ఏళ్ల తర్వాత మర్చిపోని చంద్రబోస్..! ఏకంగా రూ.40 లక్షలతో
తిరుమల వెళ్లేవారికి మరో శుభవార్త..
తిరుమల వెళ్లేవారికి మరో శుభవార్త..
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!